4 వారాల తర్వాత 'పుష్ప3'?

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి(35) అనే మహిళ మృతిచెందడం, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ ప్రస్తుతం ఆసుపత్రిలో 11 రోజుల నుంచి చికిత్స పొందుతుండటం... వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు.. అల్లు అర్జున్ అరెస్ట్... ఇలా వెంట వెంటనే పరిణామాలన్నీ జరిగిపోయాయి. బెయిల్ పై బన్నీ బయటకు వచ్చారు. ఆయన తరఫున ఏపీ మాజీ సీఎం జగన్ వ్యక్తిగత కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. గంటకు రూ.4 లక్షల చొప్పున నాలుగు గంటలకు రూ.16 లక్షలు ఆయన వరకే ఖర్చైంది. తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ కలిపి మొత్తంగా అల్లు అర్జున్ బయటకు రావడానికి కోటిరూపాయలు అయినట్లు తెలుస్తోంది.

ఆ కోటిరూపాయలు ఆ కుటుంబానికిస్తే బాగుండేదిగా
ఆ కోటి రూపాయలు బాధిత కుటుంబానికి అందజేస్తే ఎంతో బాగుండేదని ప్రజాస్వామిక వాదులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు లాయర్ల కోసం, బెయిల్ కోసం, ఇతరత్రా వ్యక్తులతో మాట్లాడుకోవడానికి, వారికి ఎంతివ్వాలి? తదితర విషయాలన్నీ కలిపితే చాలా ఖర్చవుతుందంటున్నారు. అవే రేవతి కుటుంబానికిస్తే పిల్లవాడు కోలుకుంటే పాప, బాబు.. ఇద్దరి భవిష్యత్తుకు ఢోకా లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ డబ్బులన్నీ వారి బ్యాంకు ఖాతాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ గా వేస్తే. ప్రస్తుతానికి తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలకే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తర్వాత పరిణామాలేంటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. బెయిల్ సమయం పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకే తిరిగి రిమాండ్ కు వెళ్లాల్సి ఉంటుంది.

Allu Arjun s case to take a crucial turn after interim bail ends

సుప్రీంకోర్టులో భారీగా ఖర్చుపెట్టాలి
అలా రిమాండ్ కు వెళ్లకుండా ఉండాలంటే.. ఒకవేళ హైకోర్టులో చుక్కెదురైతే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ భారీగా ఖర్చవుతుంది. క్వాష్ పిటిషన్ లో బెయిల్ ఇలా ఇస్తారంటూ తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది జస్టిస్ శ్రీదేవిని ప్రశ్నించారు. ఇది వివాదాస్పదంగా మారింది. రెగ్యులర్ బెయిల్ కావాలంటే నాంపల్లి కోర్టునే ఆశ్రయించాల్సి ఉంటుంది. అక్కడ బెయిల్ వస్తుందా? రాదా? అనేది నాలుగు వారాల తర్వాతే తేలుతుంది. దీనిపై వాదనలు జరుగుతాయి. ప్రభుత్వం వినిపించే వాదనలు, ప్రభుత్వ లాయరు వాదనాపటిమను బట్టి అల్లు అర్జున్ భవిష్యత్తు ఆధారపడివుందని చెప్పొచ్చు. పుష్ప2 సినిమా బ్రహ్మాండంగా ఆడుతుందని ఆనందించేలాగా ఇటువంటివి చోటుచేసుకోవడంపై బన్నీ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. ఏదేమైనప్పటికీ నాలుగు వారాల తర్వాతే ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+