అల్లు అర్జున్ విడుదల ఆలస్యమా? రేపేనా?: హీరోకి జైల్లో టీ, స్నాక్స్
సంధ్య థియేటర్ ఘటన కేసులో శుక్రవారం మధ్యాహ్నం అరెస్టయిన సినీనటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే, ఆ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్‌కు మంజూరు చేసింది. దీంతో ఆయన శుక్రవారం సాయంత్రం లేదా రాత్రి విడుదలవుతారని అంతా అనుకున్నారు.
కానీ, జైలు అధికారులకు బెయిల్ పేపర్లు అందకపోవడంతో అల్లు అర్జున్ విడుదల శుక్రవారం రాత్రి 10 గంటల వరకు కూడా జరగలేదు. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఇచ్చిన బెయిల్ పేపర్లు సరిగా లేవని జైలు అధికారులు చెప్పారు. దీంతో అల్లు అర్జున్ కోసం ఆయన ఇంట్లో కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు, భారీ ఎత్తున అభిమానులు అటు జైలు వద్ద.. ఇటు అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమాన నటుడి కోసం వేచిచూస్తున్నారు.

కాగా, హైకోర్టులో వాదనల సందర్భంగా న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది. అల్లు అర్జున్ నటుడు అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులు ఆయనకు నిరాకరించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉందని పేర్కొంది.
నటుడు కావడం వల్ల పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్‌కు నేరాలు ఆపాదించాలా? అని హైకోర్టు నిలదీసింది. తమకు మృతురాలు కుటుంబంపై సానుభూతి ఉందని.. అంతమాత్రాన నేరాన్ని ఒకరిపైన రుద్దలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో జరిగిన అర్నాబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వ కేసును ప్రస్తావించిన జడ్జి ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించినట్లు తెలిసింది.
అంతేగాక, రెగ్యూలర్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాలని అల్లు అర్జున్ కి సూచించింది. ఈ కేసుకు విచారణకు సహకరించాలని సూచనలు చేసింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని, సాక్షులను ప్రభావితం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ పేపర్లు రాకపోవడంతో చంచల్‌గూడ జైలు నుంచి రాత్రి వరకు కూడా అల్లు అర్జున్ విడుదల కాలేదు. జైల్లో అల్లు అర్జున్ కు జైలు అధికారులు టీ, స్నాక్స్ అందించినట్లు తెలిసింది.
క్యాబ్‌లో వెళ్లిపోయిన అల్లు అరవింద్
మరోవైపు, అల్లు అర్జున్ విడుదల ఇవాళ ఉండే అవకాశం లేదనే అంచనాతో ఆయన తండ్రి అల్లు అరవింద్ చంచల్ గూడ జైలు నుంచి ఓ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిపోవడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్‌ను జైలులో ఉంచుతున్నారనే కొంత అసహనంతో అరవింద్ సాధారణ క్యా చేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications