కవిత అరెస్టుపై అమిత్ షా ఏమన్నారంటే?: చంద్రబాబును లాగిన కేటీఆర్, ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఓ కార్యక్రమంలో జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం లేదని చెప్పారు. లిక్కర్ కేసులో ఎప్పట్నుంచో విచారణ జరుగుతోందన్నారు.
ఎన్నికల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని కేసుల విచారణ జరగదని అమిత్ షా వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి చెబితే దర్యాప్తు సంస్థలు అరెస్టులు చేయవని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశానుసారం దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయని అమిత్ షా చెప్పారు. దర్యాప్తు సంస్థలు తమకు చెప్పి ఎవరినీ అరెస్టు చేయవని తెలిపారు. దర్యాప్తు సంస్థలు విచారణను స్వేచ్ఛగా కొనసాగిస్తున్నాయన్నారు.

కవిత అరెస్టుపై బీజేపీ కేటీఆర్ ఫైర్: చంద్రబాబు ట్వీట్ రీట్వీట్
కవిత అరెస్టు నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదన్నారు. మరోవైపు, గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దర్యాప్తు సంస్థలు, బీజేపీపై చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Couldn’t have put it better than @ncbn Garu below 👇 https://t.co/AyrZXtFTqP
— KTR (@KTRBRS) March 15, 2024
కాగా, 2019 ఎన్నికల వేళ సమయంలో చంద్రబాబు, బీజేపీకి మధ్య తీవ్ర విభేదాలు కొనసాగిన విషయం తెలిసిందే. కానీ, అదే బీజేపీ ఇప్పుడు చంద్రబాబుకు మిత్రపక్షం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. చంద్రబాబు గతంలో చేసిన ఓ పాత ట్వీట్‌ను వెలికితీశారు. తన సోదరి కవితను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఆ ట్వీట్‌ను రీపోస్ట్ చేయడం గమనార్హం.
అసలు చంద్రబాబు గతంలో చేసిన ట్వీట్‌లో ఏం చెప్పారంటే..?.. '2019 సాధారణ ఎన్నికల ముందు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తూ విపక్ష నేతలను, వారి కుటుంబ సభ్యులను వేధించడం తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తోంది. బీజేపీ ఏ విధంగా రాజకీయ ప్రతీకారానికి ఒడిగడుతోందో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఈ దాడులు ఈ సమయంలోనే జరగడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు దాడులు చేస్తున్నారు?' అని పేర్కొన్నారు.
కాగా, చంద్రబాబు 2019 ఫిబ్రవరి 6న ఆ ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్ ను ఇవాళ కవిత అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ రీట్వీట్ చేయడం గమనార్హం. "ఈ కింది ట్వీట్‌లో చంద్రబాబు గారు బాగా చెప్పారు... ఇంత కరెక్ట్‌గా ఎవరూ చెప్పలేరేమో!" అంటూ కేటీఆర్
కవిత అరెస్టుపై అనవసర కామెంట్స్ వద్దు: కిషన్ రెడ్డి
కవిత అరెస్టు నేపథ్యంలో పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. శుక్రవారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన కిషన్ రెడ్డి.. కవిత అరెస్టు విషయంలో ఏదిపడితే అది మాట్లాడొద్దని సూచించారు. కవిత అరెస్టుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించినది కాదన్నారు. కవిత అరెస్ట్ గురించి ఎలాంటి ప్రెస్‌మీట్‌లు పెట్టవద్దన్నారు.
#WATCH | Delhi: BRS MLC K Kavitha brought to the Enforcement Directorate (ED) Office.
— ANI (@ANI) March 15, 2024
K Kavitha had been arrested by the ED and brought to Delhi where she will be further questioned in connection with the Delhi excise policy-linked money laundering case. pic.twitter.com/9TUvwsoa8Z
ఢిల్లీ ఈడీ ఆఫీసుకు చేరుకున్న కవిత
కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఈడీ ఆఫీసుకు ఆమెను తరలించారు. ఈడీ ఆఫీసులోనే కవిత ఈ రాత్రి బస చేయనున్నారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. శనివారం ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications