రేపు లేదా సోమవారం కౌన్సెలింగ్‌కు, అందుకే: యాంకర్ ప్రదీప్‌కు రిలీఫ్!

Posted By:
Subscribe to Oneindia Telugu
  Anchor Pradeep's Latest Video Going Viral, Watch యాంకర్ ప్రదీప్ 'వివరణ' వీడియో వైరల్

  హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన యాంకర్ ప్రదీప్ వ్యవహారంపై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ప్రదీప్ శనివారం లేదా సోమవారం కౌన్సెలింగ్‌కు హాజరు కావొచ్చునని చెప్పారు. ఆయన షూటింగులో బిజీగా ఉండటం వల్ల రాకపోవచ్చునని చెప్పారు.

  కౌన్సెలింగ్‌కు యాంకర్ ప్రదీప్!: తప్పును అంగీకరించి 'నిలబెట్టుకున్నాడు'!

  శుక్రవారం వరకు (ఈరోజు వరకు) ఆయన కౌన్సెలింగ్‌కు రావాలని, లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ముందుగా ఉన్న కాల్షీట్ల మేరకు ఆయన అనుమతి తీసుకొని రేపు లేదా సోమవారం రావొచ్చునని పోలీసులు చెబుతున్నారు.

  Anchor Pradeep may attend for counselling on Saturday or Monday

  కౌన్సెలింగ్‌కు మాత్రం కచ్చితంగా రావాల్సిందే అని చెప్పారు. సామాన్యుల్లా అతనికి మినహాయింపులు ఉండవని చెబుతున్నారు. లేదంటే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ప్రత్యేక అనుమతితో కౌన్సెలింగ్ తేదీని మాత్రం పొడిగించుకునే వెసులుబాటు ఉందని చెబుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TV Anchor Pradeep may attend for counseeling on Saturday or Monday, who is facing drunk and driven case.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి