India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Hyper Aadhi and Varshini:రైటర్ ఆది నువ్వు నాకు రైట్‌ రా..ఔను వాళిద్దరూ ప్రేమలో పడ్డారు..!!

|
Google Oneindia TeluguNews

హైపర్ ఆది... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు.అలానే వర్షిణి సౌందర్ రాజన్... ఈ పేరు కూడా పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. ఏంటి.. ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన ఏంటని అనుకుంటున్నారా..?మరదే కొంత మంది స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీల విషయాలు ఎప్పుడూ ఇంట్రస్టింగ్‌గానే ఉంటాయి. ఇక అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

పరిచయం అక్కర్లేని పేరు హైపర్ ఆది

పరిచయం అక్కర్లేని పేరు హైపర్ ఆది

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఎంతో మంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది. అంతెందుకు ఎంటర్‌టెయిన్‌మెంట్‌ రంగంలో ఈటీవీ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి ఎంతో మందిని లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చింది. అలాంటి వారిలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఒకరు. హైపర్ ఆది గురించి చెప్పక్కర్లేదు. టైమ్లీ పంచెస్‌తో అతి తక్కువ సమయంలోనే టీమ్‌ లీడర్‌గా ఎదిగాడు. తాను రాసుకునే స్క్రిప్ట్‌లో లైను లైనుకు ఓ పంచ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అంతేకాదు తన పంచ్‌లను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు కూడా. కొంత డబుల్‌ మీనింగ్‌లో ఉన్నా హైపర్ ఆది కామెడీని జనాలు తెగ బాగా ఎంజాయ్ చేస్తారు.

జబర్దస్త్‌కు దూరం..?

జబర్దస్త్‌కు దూరం..?

ఇక జబర్దస్త్‌లో ఒక వెలుగు వెలుగొందిన ఆదికి క్రమంగా సినిమా అవకాశాలు వచ్చాయి. అక్కడా తన నటనతో ఆకట్టుకున్నాడు ఆది. బిగ్‌స్క్రీన్‌ పై హైపర్ ఆది కనపడగానే జనాల విజిల్స్‌తో థియేటర్ మారుమోగి పోతుంది. ఒక కమెడియన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆది. ఆదికి మంచి ఫేమ్ వచ్చేయడంతో అదే ఈటీవీలో ఢీ అనే డ్యాన్స్ ప్రోగ్రాంలో టీమ్‌ లీడ్‌గా చేస్తూ జనాలను ఎంటర్‌టెయిన్ చేస్తున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో జబర్దస్త్‌కు దూరమయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సుడిగాలి సుధీర్ జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పేసి మరో ఛానెల్‌లో బ్యూటీ అనసూయతో కలిసి ఓ సింగింగ్ ప్రోగ్రాంకు లీడ్ యాంకర్‌గా చేస్తున్నాడు.

వర్షిణి సౌందరాజన్ వీడియో

ఇదంతా అటుంచితే... వర్షిణి సౌందరాజన్ అనే మరో యాంకర్ కూడా ఈటీవీ ద్వారానే లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఆమె కూడా పలు స్మాల్ స్క్రీన్ ప్రోగ్రామ్స్‌లో ఈవెంట్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా వర్షిణి తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవడంతో స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఆది వర్షిణిలు ప్రేమలో పడ్డారా అనే మరో వాయిస్ వినిపిస్తోంది. ఆమె పెట్టిన పోస్టు మొదట్లో బాగానే ఉన్న చివర్లో మాత్రం తేడా కొట్టే ట్విస్ట్ ఇచ్చింది.

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
హైపర్ ఆదికి వర్షిణి ప్రపోజ్

హైపర్ ఆదికి వర్షిణి ప్రపోజ్

ఇక అసలు విషయానికొస్తే హైపర్ ఆది బర్త్‌డేను వర్షిణి సెలబ్రేట్ చేసింది. ఆది కేక్ కట్ చేశాడు. ఇంతవరకు కహానీ బాగానే ఉంది. కానీ వర్షిణి ఆ సెలబ్రేషన్స్‌ను ఇన్స్‌టాలో షేర్ చేస్తూ ఓ కొత్త డౌట్ అందరిలో క్రియేట్ చేసింది. " ఆది నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నా జీవితంలో నువ్వు ఎప్పటికీ ఉండిపోవాలి. నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, చీకట్లో 3 గంటల స్నేహితుడివి, నా కష్టసుఖాల్లో నాకు ఎప్పుడూ అండగా ఉన్నావ్" అంటూ రాసుకొచ్చింది. ఇక్కడివరకు బాగానే ఉంది బొమ్మ. ఆ తర్వాత చివర్లో ట్విస్ట్ ఇస్తూ " రైటర్ ఆది నువ్వు నాకు రైట్‌ రా ఆది "అంటూ రాసుకొచ్చింది. దీంతో నెటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్స్ రాస్తున్నారు.

మొత్తానికి బుల్లితైరపై సుడిగాలి సుధీర్ -రష్మీ గౌతమ్‌ల తర్వాత మరో క్రేజీ కాంబోను చూడబోతున్నామంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు ఆది వర్షిణిలు ప్రేమలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు. మరి వీరి కెమిస్ట్రీ బహిర్గతం అవుతుందో లేదో చూడాలంటే వర్షిణి-ఆదిలను ఇక తప్పక ఫాలో అవ్వాల్సిందే

English summary
Anchor Varshini indirectly propose Hyper Aadhi on his birthday,video goes viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X