పాఠశాలలకు ఆరు రోజుల సెలవులు, తాజా ఉత్తర్వులు..!!

తెలంగాణలోని పాఠశాలలకు ఈ నెలలో ప్రత్యేకంగా సెలవులు వచ్చాయి. ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలో క్రిస్మస్ సెలవులతో పాటుగా మరో ఆరు రోజులు సెలవులు ఖరారు చేసారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మూడు విడతలు ఎన్నికలు జరిగే జిల్లాల్లో విడతల వారీగా రెండు రోజులు చొప్పున సెలవులు ప్రకటించారు. దీంతో, క్రిస్మస్ సెలవులకు ముందే పాఠశాలలకు ప్రత్యేక సెలవులు ఇవ్వనున్నారు.

పంచాయితీ ఎన్నికల వేళ పాఠశాలలకు వరుస సెలవులు వచ్చాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ విద్యార్ధులకు సెలవులు ప్రకటించారు. స్థానిక సంస్థల పోలింగ్ పాఠశాలల్లో ఏర్పాటు చేసారు. తొలి విడత పోలింగ్ రేపు జరగనుంది. దీంతో, తొలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ రోజు, రేపు పాఠశాలలకు సెలవు ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. రెండో విడత పోలింగ్ జరిగే డిసెంబర్ 13,14 తేదీలు రెండో శనివారం, ఆదివారం కావటంతో ప్రత్యేకంగా సెలవుల ప్రకటన అవసరం లేకుండా పోయింది. ఇక.. మూడో విడత పోలింగ్ సందర్భంగా ఈ నెల 16,17 తేదీల్లో పాఠశాలలకు ఆ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు ప్రకటించారు.

announces-holidays-for-schools-amid-panchayat-elections-in-the-state-details-here

ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సామాగ్రిని సిద్దం చేయటం.. పోలింగ్ నిర్వహణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రైవేటు, ప్రభుత్వ కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక.. క్రిస్మస్ ముందు రోజు అంటే డిసెంబర్ 24 (క్రిస్మస్ ఈవ్)ను ప్రభుత్వం ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది.

ఉద్యోగులు ఈ ఒక్క రోజు కూడా సెలవు తీసుకుంటే డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 28 వరకు అంటే మొత్తం ఐదు రోజుల వరకు సెలవులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక క్రైస్తవ విద్యా సంస్థలకు ఏకంగా డిసెంబర్ 21 నుంచి 28 వరకు మొత్తం 8 రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది. దీంతో సెలవులకు ముందు నుంచే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+