బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు నమోదు

హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ ఫిర్యాదు మేరకు అదే పీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు.

రాజా సింగ్ హనుమాన్ వ్యాయామశాల వద్ద మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐదు రోజుల క్రితం శ్రీరామనవమి శోభాయత్రలో భాగంగా అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. అంతకుముందు అనుమతి లేకుండా శోభయాత్ర నిర్వహించినందుకు రాజా సింగ్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Another case filed on goshamahal bjp mla raja singh

బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని మాధవీ లతపై బేగంబజార్ పోలీస్ స్టేషన్​‌లో కేసు నమోదు అయింది. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బేగంబజార్ ఇన్​​స్పెక్టర్​ విజయ్ కుమార్ తెలిపారు. మాధవీ లతను హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించినప్పటి నుంచి ఓ వర్గానికి (ముస్లిం కమ్యూనిటీ) వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు షేక్ ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏప్రిల్ 17న రాత్రి శ్రీ రామ నవమి శోభాయాత్ర సందర్భంగా బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దంబర్ బజార్ వద్ద ఓ మసీదుపై బాణం వదులుతున్నట్లు వ్యవహరించి ముస్లింల మనోభావాలను దెబ్బ తీసినట్లు పోలీసులకు తెలిపారు. ఏప్రిల్ 20న తమకు ఫిర్యాదు అందిందని, మాధవీ లతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+