తెలంగాణలో మరో కరోనా కేసు..? వారం క్రితం దుబాయ్ నుంచి రాక, వైరస్ సోకిందని...

కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. భారత్‌లో కూడా పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇటలీ పర్యాటకుడి భార్యతో వాటి సంఖ్య ఏడుకి చేరింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో తొలి పాజిటివ్ కేసు సాప్ట్ వేర్ ఇంజినీర్‌ది కాగా.. కామారెడ్డిలో మరొకరికి సోకినట్టు తెలుస్తోంది. అతను కూడా వారం రోజుల క్రితం దుబాయ్ నుంచి రావడంతో కరోనా వైరస్ సోకిందనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.

 another corona positive case in telangana state..?

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయ్ మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన జిన్న రాజయ్య కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు కనిపించాయి. కామారెడ్డి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే జ్వరం, తుమ్ములు, వాంతులు చేసుకోవడంతో కరోనా వైరస్ సోకిందని వైద్యులు అనుమానిస్తున్నారు. అతను వారం రోజుల క్రితమే ఇండియా రావడం.. కరోనా లక్షణాలు కనిపించడంతో.. వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. కామారెడ్డి వైద్యుల సూచనమేరకు అతనిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ పరీక్షలు చేసి.. వ్యాధి నిర్ధారణ చేస్తారు.

మరోవైపు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబసభ్యులకు వైరస్ సోకలేదని.. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆయా సంస్థలపై చర్యలు తప్పవని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+