హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో అల్పపీడనం: 23వ తేదీన ఏర్పడే అవకాశం, శుక్రవారం నుంచి మళ్లీ వర్షాలు..

|
Google Oneindia TeluguNews

అల్పపీడన ప్రభావంతో గత కొద్దిరోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో జోరు వానతో వరదనీరు చేరింది. మరోవైపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో మరికొద్దిరోజుల పాటు వర్షాలు కంటిన్యూగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Recommended Video

AP Rains Alert మరో రెండు రోజులు భారీ వర్షాలు, గోదావరికి మరింత వరద పోటెత్తే అవకాశం | Oneindia Telugu

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో గురువారం కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఇదిలాఉంటే మరో అల్పపీడనం ఏర్పడుతుందనే అంశం కలవరానికి గురిచేస్తోంది.

another low pressure in 23rd of this month..

ఆగస్ట్ 23వ తేదీన వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. దీంతో శుక్రవారం తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించారు.

అయితే వర్షాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు సాధారణం కంటే 44 శాతం వర్షపాతం అధికంగా నమోదయిందని వెల్లడించారు. దీనికి సంబంధించిన నివేదికను తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి కూడా సమర్పించింది. ఏ ఒక్క జిల్లాలోనూ లోటు వర్షపాతం లేదని తెలియజేసింది. దీంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది.

English summary
another low pressure in 23rd of this month hyderabad weather officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X