కేసీఆర్ పై పోటీలో తగ్గేదేలే.. కామారెడ్డి రైతులు, పౌల్ట్రీ రైతులు.. నామినేషన్లు ఎప్పుడంటే!!
తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం జోరుగా సాగుతుంది . రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. ఇక ఇదే సమయంలో కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఆయనకు షాక్ ఇవ్వనున్నారు కామారెడ్డి ప్రాంత రైతులు.
మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేసిన కామారెడ్డి ప్రాంత రైతులు తాము కెసిఆర్ పై పోటీగా ఎన్నికల్లో నామినేషన్లు వేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పౌల్ట్రీ రైతులు కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే తాము కెసిఆర్ పై పోటీకి వంద నామినేషన్లు దాఖలు చేస్తామని ఇప్పటికే కామారెడ్డి ప్రాంత రైతులు చెప్పటం కేసీఆర్ కు షాక్ కాగా, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు సమావేశమై తమ భూములు కాపాడుకునేందుకు తాము ఎంతవరకైనా వెళ్తామని ప్రకటించారు.
రైతులకు నష్టం కలిగించే మాస్టర్ ప్లాన్ ను రద్దు చెయ్యాలని లేదంటే పోటీ చేస్తామని వెల్లడించారు. ఇక తాజాగా భూ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీఎం కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా వందమంది రైతులు నామినేషన్లు దాఖలు చేస్తామని ఈనెల 6వ తేదీన రైతు ట్రాక్టర్ల పై వెళ్లి నామినేషన్లు వేస్తామని పేర్కొన్నారు .
ఇక తాజాగా వందమంది పౌల్ట్రీ రైతులు కేసీఆర్ కి వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తామని కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. పౌల్ట్రీ రైతుల అసోసియేషన్ తాజాగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అటు రైతులు, ఇటు పౌల్ట్రీ రైతులు నామినేషన్లు వేస్తామని ప్రకటించటం పట్ల స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications