కొత్తగా చెప్పిన చంద్రబాబు: దూకుడులో టీ-టీడీపీ

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరంగల్ పర్యటన తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం తీసుకు వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలవవని చంద్రబాబు 'కొత్తగా' చెప్పి టీడీపీ క్యాడర్‌లో ఆనందం తీసుకు వచ్చారు. ఇదే దూకుడుతో కరీంనగర్‌లో మరోసారి చంద్రబాబు పర్యటించనున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కలుస్తాయని చంద్రబాబు చెబుతున్నారని తెరాస విమర్శించింది. దీనికి ధీటుగా చంద్రబాబు ఏపీ, టీలు కుండబద్దలు కొట్టడం విశేషం.

తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో సైతం ఇలాంటి పర్యటనలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో పూర్వవైభవాన్ని నింపడానికి తెలంగాణ టీడీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మార్చి 3న కరీంనగర్‌లో చంద్రబాబు పర్యటన కోసం కసరత్తు జరుగుతోంది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పర్యవేక్షణలో బాబు కరీంనగర్‌ పర్యటనకు భారీ సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

సుమారు 8 నెలల తర్వాత తెలంగాణలో తొలిసారిగా పర్యటించిన చంద్రబాబుకు ప్రజల నుంచి వచ్చిన ఆనందాన్ని కలిగించిందని అంటున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు చంద్రబాబు వరంగల్‌ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించినప్పటికీ భారీగా కార్యకర్తలు తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం కన్పిస్తోంది.

AP CM Chandrababu tour to karimnagar on March 3rd

రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టడంతో మున్ముందు తెలంగాణలో టీడీపీ మరింత బలపడుతుందనే విశ్వాసం పెరిగినట్టుగా చెబుతున్నారు. ఇదే స్ఫూర్తితో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని పార్టీ అధినేత శ్రేణులకు సూచించారని తెలుస్తోంది.

గతంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకమనే ముద్ర పడ్డ కారణంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కొన్ని వర్గాలకు దూరమైన టీడీపీ ఆ ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశానిస్పృహలు ఆవరించాయి. ఇదే తరుణంలో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు అనూహ్యంగా పార్టీ ఫిరాయించి అధికార తెరాసలోచేరిపోవడంతో ఇక తెలంగాణలో టీడీపీ భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారుతుందని భావించారు.

అయితే, చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఏపీ పరిపాలనాపరమైన పనుల్లో నిమగ్నమవడంతో పాటు తెలంగాణలో పర్యటించడం గమనార్హం. దీనిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది కూడా. అయితే, తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న ప్రధాన లక్ష్యంతో చంద్రబాబే స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+