Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జేసీబీ నడుపుతున్న అరుణ‌.. మంత్రి సీత‌క్క‌ ఫిదా!

ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పింపినన్ అన్నాడు ఓ మహాకవి. ఆయన అన్న మాటలు అక్షరసత్యాలు. మహిళలు ఏ పనినైనా నేర్చుకుంటే పురుషులకు దీటుగా పని చేస్తారు. మహిళలు సాంప్రదాయ పరిధిని దాటి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.

జెసిబినే నడుపుతూ మహిళా సాధికారతకు అద్దం పడుతున్న అరుణ
తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లా ఎరుగొల్లపాడు గ్రామానికి చెందిన పాలమాకుల అరుణ ఏకంగా జెసిబినే నడుపుతూ మహిళా సాధికారతకు నిజమైన నిదర్శనంగా నిలుస్తున్నారు. వేలాదిమంది మహిళలకు స్ఫూర్తిని ఇస్తున్నారు.జనగామ జిల్లా ఎరుగొల్లపాడు గ్రామానికి చెందిన అరుణ పదో తరగతి వరకు చదువుకున్నారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యతలు ఆమెపై పడ్డాయి.

Aruna who is operating a JCB has impressed Minister Seethakka

స్వయం సహాయక సంఘంలో చేరడం అరుణ జీవితంలో గొప్ప మలుపు
2012లో పాలమాకుల నాగరాజుతో వివాహం జరిగింది. అయితే ఇరు కుటుంబాల నుండి ఆమె ఎదగడానికి కావలసిన మద్దతు దొరకలేదు. అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నడుమ జీవితాన్ని సాగించిన అరుణ స్వయం సహాయక సంఘంలో చేరడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. 2013లో స్వయం సహాయక సంఘంలో చేరి అరుణ, 2014లో ఎస్హెచ్జీ ద్వారా లక్ష రూపాయల రుణం తీసుకొని పాతఅప్పులు తీర్చి, క్రమబద్ధమైన పొదుపుతో కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువచ్చారు.

స్త్రీనిధి ద్వారా జేసీబీ కొన్న అరుణ
కుటుంబ అవసరాల కోసం అరుణ భర్త నాగరాజు జెసిబీ డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవర్ గా పని చేస్తూ ఉండగా, అరుణ వ్యవసాయ కూలిగా పనులు చేస్తూ, కుట్టు పనులు చేస్తూ కుటుంబాన్ని ఆదుకున్నారు. 2019లో ఆమె స్త్రీ నిధి సహకారంతో, ఎస్ హెచ్ జి బ్యాంకు లింకేజ్ తో జెసిబిని కొనుగోలు చేశారు. భర్త ప్రోత్సాహంతో స్వయంగా జెసిబిని నడపడం నేర్చుకున్నారు. 2024లో విజయవంతంగా డ్రైవింగ్ ను పూర్తి చేశారు.

జేసీబీతో రోజుకు 5 వేలు సంపాదిస్తున్న అరుణ
అరుణ కుటుంబం ఇప్పటివరకు 22 లక్షల పదివేల రూపాయల ఆర్థిక రుణాలను పొందింది. వ్యవసాయం, కిరాణా దుకాణం పనుల ద్వారా కుటుంబం స్వయం ఆధారంగా నిలబడింది. జెసిబి ద్వారా గంటకు వెయ్యి రూపాయల నుండి 1200 రూపాయల ఆదాయం సంపాదిస్తున్న అరుణ, రోజుకు సగటున నాలుగు వేల నుంచి 5 వేల వరకు సంపాదిస్తున్నారు.

ఎస్ హెచ్ జీ ల ఫలితంగానే ఆర్థిక స్వావలంబన
స్వయం సహాయక సంఘం గ్రూప్ లీడర్ గా, గ్రామ సంఘం అధ్యక్షురాలిగా, మండల సమాఖ్య అధ్యక్షురాలిగా అరుణ పనిచేస్తున్నారు. ఆమె నాయకత్వంలో గ్రామంలోని అనేక మహిళలు స్వయం ఉపాధిని పొందుతున్నారు. తాను సాధించిన ఆర్థిక స్వావలంబన ఎస్ హెచ్ జీ ల ఫలితంగానే సాధ్యమైందని అరుణ గర్వంగా చెబుతున్నారు.

గ్రామీణ మహిళల శక్తికి పాలమాకుల అరుణ అద్భుతమైన ఉదాహరణ
అరుణ జీవన ప్రస్థానాన్ని చూసిన గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గ్రామీణ మహిళల శక్తికి పాలమాకుల అరుణ అద్భుతమైన ఉదాహరణ అంటూ కొనియాడారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా మాత్రమే కాదు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారని చెప్పడానికి నిదర్శనమన్నారు. సెర్ప్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అరుణను కలిశానని, జెసిబి నడుపుతున్న ఆమె ధైర్యం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+