ముస్లింల డేటా కోసమే ఆ కమిషన్? అమిత్ షా పై ఓవైసీ ఫైర్..!

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని జనాభా గణన కమిషన్.. జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజల వాహనాలు, ఆస్తుల కొనుగోళ్లు, పాఠశాలల్లో చేరికలు, ఆధార్, ఓటర్లు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని హిందూ, ముస్లిం, క్రైస్తవ వర్గాలుగా వర్గీకరించి తెలుసుకోవాలని కోరుతోందని వార్తలొస్తున్నాయి. రాజ్యాంగంలోని లౌకిక స్వరూపం మతపరమైన వర్గాల కింద సమాచారాన్ని సేకరించడాన్ని నిరోధిస్తున్నందున రాష్ట్రాలు ఈ విషయంలో గందరగోళానికి గురవుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

SIRతో 13 కోట్ల మంది ఔట్-విపక్షాలు ఎన్నికలు బహిష్కరించాలి-మాజీ హోం కార్యదర్శి లేఖ..!
SIRతో 13 కోట్ల మంది ఔట్-విపక్షాలు ఎన్నికలు బహిష్కరించాలి-మాజీ హోం కార్యదర్శి లేఖ..!

ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) .. ఈ వ్యవహారంపై స్పందించారు. ముస్లింల విద్యా, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమాచారాన్ని సేకరించాలని తాము మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పుడు, కేంద్ర ప్రభుత్వం వెంటనే ముఖం చాటేసేదని ఆయన గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అమిత్ షా నేతృత్వంలోని "జనాభా కమిషన్" (Demography Commission), ఏ మతానికి చెందిన ప్రజలు ఎన్ని వాహనాలు కొనుగోలు చేశారు, ఎంత భూమిని కలిగి ఉన్నారు వంటి వివరాలను రాష్ట్రాల నుండి సేకరిస్తోందని ఆరోపించారు.

Asaduddin Owaisi Alleges Amit Shah s Demography Panel Could Use Religion-Wise Data to Target Muslims
మామునూరు ఎయిర్ పోర్టుకు కొత్త పేరు సూచించిన ఓవైసీ-రేవంత్ కు లేఖ..!
మామునూరు ఎయిర్ పోర్టుకు కొత్త పేరు సూచించిన ఓవైసీ-రేవంత్ కు లేఖ..!

జనాభా గణన కమిషన్ అసలు ఉద్దేశ్యం వాస్తవ సమాచారం ఆధారంగా మెరుగైన విధానాలను రూపొందించడం కాదని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. పైగా, ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి, వారికి మిగిలి ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా లాగేసుకోవడానికి వీలుగా ఆ సమాచారాన్ని వక్రీకరించడమే దీని అసలు ఎజెండా అని ఓవైసీ ఫైర్ అయ్యారు. ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ విషయంలో హైదరాబాద్ లో ముస్లింలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీటిని మతాల వారీగా విభజన కోసం కేంద్రం వాడుకుంటుందని తెలిస్తే జనాభా గణనకూ ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే కేంద్రం మాత్రం జనాభా గణన కమిషన్ కు ఇచ్చిన ఆదేశాల మేరకు ముందుకెళ్లేలా సూచనలు చేస్తోంది. అసలే జనాభా లెక్కల ప్రక్రియ వివిధ కారణాలతో కోవిడ్ నుంచీ వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జనగణనకు కేంద్రం సిద్దమవుతున్న వేళ.. అందులో ఇచ్చిన ప్రశ్నలపై వివాదాలు మొదలయ్యాయి. దీంతో కేంద్రం జనగణనను సకాలంలో ముందుకు తీసుకెళ్తుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+