చందానగర్‌లో కాల్పుల కలకలం.. ఖజానా జ్యువెలరీలో దోపిడీకి యత్నం !
హైదరాబాద్ చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. స్థానిక ఖజానా జ్యువెలర్స్‌లో దుండగులు దోపిడీకి యత్నం చేయడం హడలెత్తించింది. ఆరుగురు సభ్యుల గ్యాంగ్ ముందుగా షాప్ గేట్ వద్ద ఉన్న సిబ్బందిని గాయపరిచి లోపలికి చొరబడ్డారు. లోపలికి ప్రవేశించిన వెంటనే తుపాకీతో బెదిరించి, లాకర్ కీ ఇవ్వాలని సిబ్బందిని డిమాండ్ చేశారు.
సిబ్బంది కీ ఇవ్వడానికి నిరాకరించడంతో, దుండగులు డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరిపారు. అంతే కాకుండా మరికొందరిపై దాడులకు పాల్పడి,.. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగ్గొట్టి సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. రెండు రౌండ్ల ఫైరింగ్ జరిపిన వారు.. తుపాకీతో సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయని సమాచారం.

దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చందానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రాగానే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
మొత్తం ఆరుగురు సభ్యులుగా ఉన్న ఈ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో చందానగర్‌లో ఒక్కసారిగా కలకలం రేగగా, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. సమీప ప్రాంతాల్లో ప్రజాలు సైతం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications