హైదరాబాద్‌ వాసులకు గ‌మ‌నిక‌.. నేడు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్‌..

హైదరాబాద్ న‌గ‌ర వాసులకు ముఖ్య గ‌మ‌నిక‌.. ప‌ట్ట‌ణంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫ‌రాను బంద్ చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. వాటర్ సప్లయ్ లైన్‌లో పనుల కారణంగా తాగునీటి స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంతరాయం ఏర్పడనున్నట్లు జల మండలి అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అధికారులు గ్రేట‌ర్ నగరవాసులకు అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ క్ర‌మంలో న‌గ‌ర‌వాసులు నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.

నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయి లైన్‌‌లో సాంకేతిక సమస్యలు ఏ్ప‌డ్డాయ‌ని దీంతో గ్రేట‌ర్ ప‌రిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు తాజాగా ఒక ప్ర‌క‌ట‌న‌ను కూడా విడుద‌ల చేశారు. న‌గ‌రంలోని జలమండలి డివిజన్-2 (బి), బాలాపూర్ రిజర్వాయర్ పరిధిలోని గుర్రం చెరువు నుంచి సన్నీ గార్డెన్స్ వరకు GHMC, SMDP బాక్స్ డ్రెయిన్ నిర్మాణం పనులను చేప‌ట్టామ‌ని అధికారులు పేర్కొన్నారు. ఈ ప‌నుల‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బాలాపూర్ రిజర్వాయర్ అవుట్ లెట్ 450 ఎంఎం డయా పైప్‌లైన్ డైవర్షన్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Attention to the residents of Hyderabad drinking water supply ban in many areas today

ఈ క్ర‌మంలో ప‌లు ప్రాంతాల్లో తాగు నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్ప‌డింద‌ని చెప్పారు. ఈ పనులు నేడు రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 31 రాత్రి 9 గంటల వరకు ఉంటాయ‌ని అధికారులు చెప్పారు. 24 గంటలు పాటు బాలాపూర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్ప‌డే ప‌రిస్థితి ఉంద‌ని అధికారులు అంటున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ఏఏ ప్రాంతాలు..

తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలివే.. ఓఅండ్ఎం డివిజన్ - 2B: ఇందిరా నగర్, ఫీసల్‌ బండా, జీఎంచౌని, లలితా బాగ్, ఉప్పుగూడ, రాజా నరసింహ కాలనీ, దర్గా బురాన్షాహి, గాజీ-మిల్లత్, గారిసన్ ఇంజినీర్ -1 & 2, DRDO, మిధాని, DMRL, DLRL, ఒవైసీ హాస్పిటల్, CRPF, BDL, కేంద్రీయ విద్యాలయం ప్రాంతాలు. ఓఅండ్ఎం డివిజన్-2A: యాదగిరి కమాన్ ఎదురుగా ఉన్న ప్రాంతం, HIGH, MIGH, LIGH కాలనీలు, ఫహబా మసీదు, హస్నాబాద్, ఖలందానగర్, సంతోష్ నగర్, హనుమాన్ టైలర్ గల్లీ, మారుతీ నగర్, పోచమ్మ గడ్డ ప్రాంతాల్లో తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం రానుంది. వీటితో పాటు ఓఅండ్ఎం డివిజన్-10 A: మక్బూల్ నగర్, జీఎం నగర్, బాబా నగర్, క్వాద్రీ కాలనీ ప్రాంతాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+