వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ వరంగల్లో అరెస్ట్; వికారాబాద్ ఎస్పీ ఏమన్నారంటే..

|
Google Oneindia TeluguNews

అయ్యప్ప స్వామి పుట్టుక పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన బైరి నరేష్ ను ఎట్టకేలకు వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు వరంగల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు బైరి నరేష్ ను పట్టుకున్నారు. బైరి నరేష్ అయ్యప్ప స్వామిపై చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో హిందువులు, హిందూ సంఘాలు, అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. బైరి నరేష్ ను అరెస్ట్ చేయాలని, అతనిని కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

అతనిపై కేసు నమోదు చేసిన కొడంగల్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అతని కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ఈ రోజు పోలీసులు వరంగల్లో బైరి నరేష్ ను పట్టుకున్నారు. వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళుతుండగా వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నరేష్ ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోలీసులు నరేష్ ఎక్కడున్నారు అన్నది ట్రేస్ చేసి పట్టుకున్నారు. నరేష్ ను ప్రస్తుతం కొడంగల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. ఇప్పటికే నరేష్ పై పోలీస్ స్టేషన్ తో పాటుగా, వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

Bairi Naresh arrested in warangal for controversial comments on Ayyappa swamy

హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూ, అయ్యప్ప స్వామి పుట్టుకను అవమానిస్తూ, అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఏదైనా సభలు-సమావేశాలు జరుపుకుంటే ఇటువంటి వ్యక్తులను ఆహ్వానించకూడదని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు.

ఇలాంటి వారిని ప్రోత్సహించవద్దని, ఎవరైనా ఇటువంటి వారిని ప్రోత్సహిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగేలా మాట్లాడినా సరే సహించేది లేదని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

English summary
Bairi Naresh who made inappropriate comments on Ayyappaswamy was arrested in Warangal. Vikarabad SP said that such people should not be invited to any meeting, and action will be taken against those who encourage them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X