బాలకృష్ణ సింగిల్ టేక్ డైలాగ్.! స్వరం మార్చిన నాగబాబు.!తెర వెనక రక్తి కట్టిన సన్నివేశం.!
హైదరాబాద్ : ఎండాకాలం ద్వారా కలిగిన వేడికన్నా బాలకృష్ణ, నాగబాబు ఉదంతం సృష్టించి వేడి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా సెగలు రేపినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ నటుడు నాగబాబు ప్రతిస్పందించడం, నాగబాబుకు ప్రతికూలంగా చాలా మంది సినీ పెద్దలు జోక్యం చేసుకోవడం వల్ల సంఘటన మరింత తీవ్రరూపం దాల్చింది. అసలు జరిగిందేంటి, అందుకు ఎవరు స్పందించాలి అనే సున్నిత తేడాను మర్చిపోయి పరిశ్రమకు సంబంధించిన చాలా మంది స్పందించడంతో సంఘటన చులకన భావం దిశగా పయనించింది.

చినికి చినికి గాలివానగా మారిన వివాదం.. బాలకృష్ణ ప్రకటనతో మెత్తబడ్డ నాగబాబు..
సరిగ్గా ఇదే సమయంలో బాలకృష్ణ జోక్యం చేసుకోవడంతో నాగబాబు కూడా తన స్వరాన్ని మార్చి బాలయ్య అంటే తనకు అపార గౌరవం అంటూ ప్రకటన చేసారు. దీంతో తెర వెనక రసవత్తర సన్నివేశాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా నందమూరి బాలకృష్ణ, నాగబాబు మొత్తం వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు నిర్థారణ అవుతోంది. గత నెల మే 28వ తారీఖున బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కాస్త తొందరగా స్పందిచిన నాగబాబు జరిగిన నష్టాన్ని తెలుసుకుని, నష్ట నివారణ చర్యల దిశగా అడుగులు వేసిన్నట్టు తెలుస్తోంది.

బాలయ్య అంటే తనకు వల్లమాలిన అభిమానం.. నాగబాబు తాజా ప్రకటన..
తెర వెనుక ఏం జరిగిందనేది ఇంకా బయటకు రాకపోయినప్పటికీ, మూడు,నాలుగు రోజులుగా బాలయ్య గురించి ఎవరడిగినా, ఎంతొ సంయమనంతో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించడమే కాకుండా జరిగిన వివాదాస్పద ఘటనకు తెర దించడానికే నాగబాబు సుముఖంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. దీంతో బాలయ్య విషయంలో చెలరేగిన వివాదం మాత్రం సమసిపోయినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకు నాగబాబు ఇచ్చిన వివరణ పలువురిని విస్మయానికి గురిచేస్తున్నప్పటికి, వివాదాన్ని సామరస్య వాతావరణంలో పరిష్కరించాలని ప్రయత్నాలు చేస్తున్న మరికొంత మంది సినీ పెద్దలకు మాత్రం ఎంతొ ఉపశమనాన్ని కలిగించినట్టు తెలుస్తోంది.

బాలయ్యలా తాను హీరోని కాదు.. కేవలం మెగాస్టార్ సోదరున్ని మాత్రమేన్న నాగబాబు..
నందమూరి బాలకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, బాలయ్య అంటే తనకు నాకు గౌరవం అని, ఆరోజు ఆయన అన్నమాటలకు మాత్రమే తాను సమాధానం ఇచ్చాను తప్ప మరే ఇతర విషయాల్లో కాదని నాగబాబు పేర్కొన్నారు. అంతే కాకుండా బాలయ్య మీద ఆగ్రహం చూపించడానికి తానెవరినని, ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేసేంత గొప్పవాడిని తాను కాదని నాగబాబు స్పందించారు. జరిగిన ఘటనలో తన అభిప్రాయాన్ని తాను చెప్పానని, బాలకృష్ణతో ఏ విషయంలోను తానూ నేను సమానం కాదని స్పష్టం చేసారు నాగబాబు. తాను మెగాస్టార్ చిరంజీవికి సోదరుడిని మాత్రమేనని, బాలకృష్ణలా హీరోని కాదని, ఆయనతో తాను సమానం కాదని అన్నారు నాగబాబు.
Recommended Video

స్వార్ధం ఉన్నంత కాలం వివాదిలు ఉంటాయి.. బాలయ్య ప్రకటన వల్ల చోటు చేసుకున్న ఎన్నో మార్పులు..
జరిగిన అంశం పట్ల, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల బాలకృష్ణ కూడా వాస్తవాలు గ్రహించారని నాగబాబు తాజాగా స్పందించారు. తెర వెనక ఎవరు ఎంతవరకు సన్నివేశాన్ని రక్తి కట్టించారో తెలియదు గాని, నాగబాబు స్వరం మాత్రం పూర్తిగా మారిపోయింది. వాస్తవానికి బాలకృష్ణ చేసిన ఒకే ఒక్క ప్రకటన ఇంత మార్పు తెచ్చినట్టు చర్చ జరుగుతోంది. స్వార్థం ఉన్నంత కాలం వివాదాలు సమసిపోవు అని బాలయ్య చేసిన వ్యాఖ్యలు మోత్తం పరిశ్రమనే మార్చేసాయనే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా నాగబాబులో పరివర్తన తీసుకొచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications