అందరివాడ్ని: సీఎం క్యాంప్ ఆఫీసుకు మంత్రి తలసాని కారులో బాలకృష్ణ
ప్రముఖ నటుడు, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీకి రానున్నారు.
హైదరాబాద్: ప్రముఖ నటుడు, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. తాను నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ పన్ను మినహాయింపు విషయమై బాలకృష్ణ.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును అసెంబ్లీలో కలవాలనుకున్నారు.
అయితే, అసెంబ్లీ ఆవరణలో కలిసిన టిడిపి నేతలు రేవంత్ రెడ్డి, బిజెపి నేత కిషన్ రెడ్డి, తదిరులతో ఆయన సరదాగా ముచ్చటించారు. తాను తెలుగు ప్రజలందరివాడినని అన్నారు. సినిమా బాగా వచ్చిందని తెలిపారు.

కాగా, ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సీఎం కేసీఆర్.. బాలకృష్ణను సీఎం క్యాంప్ ఆఫీసుకు ఆహ్వానించడంతో అక్కడికి.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కారులో తీసుకెళ్లారు. అక్కడే సీఎం కేసీఆర్‌ను బాలకృష్ణ కలవనున్నారు. కేసీఆర్‌ను శాతకర్ణి సినిమా స్పెషల్ షోకు బాలకృష్ణ ఈ సందర్భంగా ఆహ్వానించనున్నారు. అలాగే పన్ను మినహాయింపుపై చర్చించనున్నారు.
ఇది ఇలా ఉండగా, సంక్రాంతి సందర్భంగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా, శ్రియా, హేమామాలిని ప్రధాన పాత్రలను పోషించారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications