చంద్రబాబు, కేసీఆర్‌లతో కలిసి గౌతమీపుత్ర శాతకర్ణి చూస్తాను: బాలకృష్ణ
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుతోను, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోను కలిసి తాను గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చూస్తానని బాలకృష్ణ శుక్రవారం తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతోను, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతోను కలిసి తాను గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చూస్తానని హిందూపురం టిడిపి ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ శుక్రవారం తెలిపారు.

ఈ నెల 12వ తేదీన ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్‌లో ప్రదర్శించే బెనిఫిట్ షోకు కేసీఆర్‌ను ఆహ్వానించానని, ఆ రోజున తెలంగాణ సీఎంతో కలిసి సినిమా చూస్తానని చెప్పారు.
అదీ మా పాలసీ: 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి కేసీఆర్ బంపరాఫర్, బాలకృష్ణ స్పందన
మరుసటి రోజు అంటే, 13వ తేదీన విజయవాడలో తాను మళ్లీ సినిమా చూస్తానన్నారు. అప్పుడు చంద్రబాబుతో కలిసి సినిమా చూసే అవకాశముందని ఆయన అన్నారు. కాగా, ఈ రోజు మధ్యాహ్నం బాలయ్య.. కేసీఆర్‌ను కలిసి సినిమాకు ఆహ్వానించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications