మునుగోడులో రంగంలోకి బండి సంజయ్.. 12రోజుల పాటు రోడ్ షోలు.. రచ్చ షురూ!!

మునుగోడు ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ, మాటల తూటాలు పేలుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ నేటితో పూర్తికానున్న నేపథ్యంలో ప్రచార పర్వంలో మరింత జోష్ పెంచారు. కీలక నేతలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.

మునుగోడులో దూకుడుగా బీజేపీ ఎన్నికల ప్రచారం

మునుగోడులో దూకుడుగా బీజేపీ ఎన్నికల ప్రచారం

మునుగోడు ఉప ఎన్నిక విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి రాష్ట్రస్థాయిలో బీజేపీ కీలక నాయకులను రంగంలోకి దించడమే కాకుండా, జాతీయ స్థాయి నాయకులను సైతం రంగంలోకి దించి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బిజెపి నేతలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు మునుగోడులో మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

రేపటి నుండి బండి సంజయ్ ప్రచారం .. నేడు మునుగోడుకు బండి సంజయ్

రేపటి నుండి బండి సంజయ్ ప్రచారం .. నేడు మునుగోడుకు బండి సంజయ్

ఇక నేటి నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడులో మకాం వేయనున్నారు. ఈరోజు సాయంత్రం మునుగోడు నియోజకవర్గానికి చేరుకోనున్న బండి సంజయ్, రేపటి నుంచి పూర్తిగా ప్రచారంపై దృష్టి సారించనున్నారు. 12 రోజులపాటు రోడ్ షో లతో ప్రచార పర్వాన్ని హోరెత్తించాలని, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాలని ప్రణాళికలు రచించిన బీజేపీ నేతలు ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో గేరు మారుస్తున్నారు. ఇక బండి సంజయ్ పర్యటన, ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఇప్పటికే కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

బీజేపీ ప్రచారానికి జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు

బీజేపీ ప్రచారానికి జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు

బిజెపి ప్రచార పర్వం లో చివరి ఘట్టం లో భాగంగా జాతీయ స్థాయి నాయకులను, కేంద్ర మంత్రులను రంగంలోకి దించాలని నిర్ణయించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తోపాటు, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులను మునుగోడుకు తీసుకు రావాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రయత్నం చేస్తోంది. సభలు, సమావేశాలు నిర్వహించాలని, పెద్ద ఎత్తున రోడ్ షో లతో ప్రజల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నం చేయాలని బిజెపి నిర్ణయించింది.

 మునుగోడుకు జేపీ నడ్డా, అమిత్ షా... సభలు, రోడ్ షో లు

మునుగోడుకు జేపీ నడ్డా, అమిత్ షా... సభలు, రోడ్ షో లు

ఈ క్రమంలోనే అక్టోబర్ 27వ తేదీన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మునుగోడు కు తీసుకువచ్చి సభ నిర్వహించాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఇక ప్రచారం లో చివరి రోజైన నవంబర్ 1వ తేదీన హోంమంత్రి అమిత్ షా మునుగోడు లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక బిజెపికి అత్యంత కీలకమైన ఎన్నిక కావడంతో బిజెపి వ్యూహాత్మకంగా మునుగోడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+