వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ జెండా చూస్తేనే టీఆర్ఎస్ నేతలకు వణుకు: బీజేపీనేతల అరెస్టులపై భగ్గుమన్న బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బొగ్గు గుడిసె బూర్గుల్ కమాన్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బిజెపి నేతల అరెస్టులను ఖండించిన బండి సంజయ్ బీజేపీ జెండాని చూస్తేనే టీఆర్ఎస్ నేతలు గజ గజా వణికిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు.

సీఎం కేసీఆర్ కు ఈడీవిచారణ తప్పదు; అందుకే కాంగ్రెస్ తో దోస్తానా: బండి సంజయ్ సంచలనంసీఎం కేసీఆర్ కు ఈడీవిచారణ తప్పదు; అందుకే కాంగ్రెస్ తో దోస్తానా: బండి సంజయ్ సంచలనం

 ప్రజల్లో బీజేపీ నేతలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీఆర్ఎస్ మూకల దాడులు

ప్రజల్లో బీజేపీ నేతలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీఆర్ఎస్ మూకల దాడులు

కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ మూకలు బరితెగించి దాడులకు పాల్పడడం హేయనీయమని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజా గోస బిజెపి భరోసా పేరుతో బైక్ ర్యాలీలతో గ్రామాల్లోకి వెళుతూ తాము ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్న బండి సంజయ్, ప్రజలలో బిజెపి నాయకులకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టిఆర్ఎస్ నాయకులు రకరకాల చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు.

గ్రామాల్లోకి బీజేపీ నేతలను రాకుండా అడ్డుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు

గ్రామాల్లోకి బీజేపీ నేతలను రాకుండా అడ్డుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు


బీజేపీ నాయకుల పై టీఆర్ఎస్ మూకలు దాడులు చేస్తూ గ్రామాలలోకి రానీయకుండా అడ్డుకుంటూ ఉంటే, చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు టిఆర్ఎస్ నేతలకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ఇదేమని ప్రశ్నించిన బిజెపి నేతలను అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూర్గుల్ కమాన్ దగ్గరికి వెళ్తున్న క్రమంలో అరెస్టు చేసిన బీజేపీ నేతలను తక్షణం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ తేల్చిచెప్పారు.

 బైక్ ర్యాలీ సదర్భంగా టీఆర్ఎస్ బీజేపీ ఘర్షణ .. బీజేపీ జెండా కూల్చివేత తో రగడ

బైక్ ర్యాలీ సదర్భంగా టీఆర్ఎస్ బీజేపీ ఘర్షణ .. బీజేపీ జెండా కూల్చివేత తో రగడ


ప్రజా గోస - బిజెపి భరోసా యాత్ర సందర్భంగా నిన్న టిఆర్ఎస్ బిజెపి నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో బూర్గుల్ కమాన్ వద్ద ఉన్న బీజేపీ జెండాను కూల్చివేశారు. దీంతో ఈరోజు బిజెపి జెండాను ఎగుర వేశామని బిజెపి నేతలు బూర్గుల్ కమాన్ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయడంతో అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వివేక్ వెంకటస్వామి తోపాటు పలువురు బీజేపీ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

బీజేపీ నేతల అరెస్ట్ పై ఆగ్రహం .. తక్షణం విడుదల చెయ్యాలన్న బండి సంజయ్

బీజేపీ నేతల అరెస్ట్ పై ఆగ్రహం .. తక్షణం విడుదల చెయ్యాలన్న బండి సంజయ్


పోలీసులు అధికార పార్టీకి వత్తాసుగా వ్యవహరిస్తున్నారని, తమపై దాడి చేశారని ఆరోపించిన బీజేపీ నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులను అడ్డుపెట్టుకొని కెసిఆర్ పాలన చేస్తున్నాడంటూ ఆరోపణలు గుప్పించారు. బూర్గుల కమాన్ వద్ద బీజేపీ జెండా ఎగరేసి తీరుతామని వారు చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ అరెస్టు చేసిన బిజెపి నేతలను తక్షణం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.

English summary
Bandi Sanjay said that the TRS leaders fear of BJP flags. Bandi Sanjay slams trs govt and police over bjp leaders arrest and demanded their immediate release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X