పైలట్ రోహిత్ రెడ్డిని కేసీఆర్ బ్లాక్ మెయిల్: షాకింగ్ విషయం చెప్పిన బండి సంజయ్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన బి ఆర్ ఎస్ పార్టీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఒక వైరస్ అని, బిజెపి ఒక వ్యాక్సిన్ అని పేర్కొని వైరస్ కావాలో వ్యాక్సిన్ కావాలో తేల్చుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

పైలట్ రోహిత్ రెడ్డిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు చేసిన తప్పుల చిట్టా తన వద్ద పెట్టుకొని సీఎం కేసీఆర్ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బెంగళూరు డ్రగ్స్ కేసు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను తాము వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు గుప్పించారు. పైలట్ రోహిత్ రెడ్డి పాత్రపై ఆరా తీయడానికి తమ లీగల్ టీం బెంగుళూరు వెళ్లిందని, బెంగళూరు డ్రగ్స్ కేసు ని ఓపెన్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని బండి సంజయ్ పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో కర్నాటక ప్రభుత్వం నుండి రోహిత్ రెడ్డికి నోటీసులు వచ్చాయని బండి సంజయ్ తెలిపారు.

ముఖ్యమంత్రి ఒక బ్లాక్ మెయిలర్: బండి సంజయ్
ఎమ్మెల్యేల ఎరకేసులో పైలట్ రోహిత్ రెడ్డి ప్రమేయం ఏంటో త్వరలోనే బయటపడుతుంది. రోహిత్ రెడ్డి చేత ఇంత హడావిడిగా 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒక బ్లాక్ మెయిలర్ అని బండి సంజయ్ ఆరోపించారు. త్వరలోనే అందరి బండారం బయటపడుతుందన్నారు బండి సంజయ్. డ్రగ్స్ కేసు పై గతంలో వేసిన సిట్ నివేదికలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదో ప్రభుత్వం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.

బీఆర్ఎస్ కార్యాలయం పెయింట్ ఆరకముందే వీఆర్ఎస్ అవుతుంది
బీఆర్ఎస్ కార్యాలయం పెయింట్ ఆరకముందే... వీఆర్ఎస్ అవుతుందన్నారు. కేసీఆర్ & టీమ్ దాదాగిరి, గుండాగిరి చేస్తే... రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. జేపీ కార్యకర్తల పవర్ ఏంటో మీకు తెలీదు అని పేర్కొన్న బండి సంజయ్ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని... పోలీసులు కూడా మార్పు కోరుకుంటున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు నిర్వాసితులని ఎందుకు పట్టించుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. బూటకపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని మండిపడ్డ బండి సంజయ్ తెలంగాణ సంపాదను దోచుకున్న కేసీఆర్ కు... రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.

బీజేపీ కార్యకర్తల సహనం పరీక్షించొద్దు
కచ్చితంగా వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని... భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చాక, అందరినీ ఆదుకుంటామని పాదయాత్రలో భాగంగా తన దృష్టికి సమస్యలను తీసుకు వచ్చిన ప్రజలకు బండి సంజయ్ హామీ ఇచ్చారు. బిజెపి కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు అని పేర్కొన్న బండి సంజయ్ తెలంగాణలో ప్రభుత్వం మారాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. పేదోళ్ల రాజ్యం తీసుకురావడానికే... పాదయాత్ర చేస్తున్నానని పేర్కొన్న బండి సంజయ్ రజాకార్ల రాజ్యాన్ని బొందపెట్టి, రామరాజ్యాన్ని స్థాపిస్తానని ప్రతినబూనారు. రామ రాజ్య స్థాపన తన అంతిమ లక్ష్యం అని బండి సంజయ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications