కేసీఆర్ కు 'సన్' స్ట్రోక్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీదే విజయం బండి సంజయ్ సంచలనాలు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోమారు తెలంగాణ సర్కార్ పై, కెసిఆర్ పై, కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని బండి సంజయ్ పేర్కొన్నారు. తాజాగా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రానికి మోడీని ఆహ్వానిస్తున్నాం
సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ సర్కార్ పై విరుచుకు పడిన బండి సంజయ్ రాష్ట్రంలో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ అయిందని ప్రజా సంగ్రామ యాత్ర పై దేశం మొత్తం చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని సంకేతాలు వస్తున్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రానికి త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించబోతున్నామని పేర్కొన్నారు బండి సంజయ్.

కేసీఆర్ కు కొడుకుతో సన్ స్ట్రోక్
తెలంగాణ లో సీఎం కేసీఆర్ పని అయిపోయిందని, కెసిఆర్ కు ఆయన కొడుకుతో సన్ స్ట్రోక్ తగులుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ అహంకారంతో, కండకావరంతో మాట్లాడుతున్నాడు అని, కేటీఆర్ వల్ల టిఆర్ఎస్ పార్టీ నాశనం అవుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ని చూసి తెలంగాణా సభ్య సమాజం తలదించుకుంటుందని పేర్కొన్నారు బండి సంజయ్. కేటీఆర్ భాష చూసి అన్ని వర్గాలు తలదించుకుంటున్నాయి అని పేర్కొన్న బండి సంజయ్ కొడుకు వల్ల కేసీఆర్ కు సన్ స్ట్రోక్ తగులుతుందని, కెసిఆర్ కుటుంబ పాలన అంతం కాబోతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

త్వరలోనే మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర
శ్రీలంక కుటుంబ పాలన కారణంగా అధోగతి పాలు అయిందని పేర్కొన్న బండి సంజయ్ తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా కుటుంబ పాలన వల్లే హీనంగా తయారైంది అంటూ విమర్శలు గుప్పించారు. త్వరలోనే మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్ రెట్టించిన ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పని చేయాలంటూ హితవు పలికారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం .. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడంపై, బలోపేతం చేయడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన బండి సంజయ్ తుక్కుగూడ సభ విజయవంతం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణలో రంగంలోకి దించబోతున్నామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయమని, ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని బండి సంజయ్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. కెసీఆర్ సర్కార్ పాలనకు చరమగీతం పాడాలని చెప్పి పార్టీ శ్రేణులకు క్షేత్ర స్థాయిలో పనిచెయ్యాలని సూచించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications