Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ ప్లాప్ సినిమా నేనింతే నా బతుకింతే: ఇదంతా ఎందుకో చెప్పిన బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో విడుదల చేసిన వీడియోలు, చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కూతురు కవిత అరెస్టు కాబోతుందని పక్కా సమాచారంతో భయపడి ప్రగతి భవన్ లో కొత్త డ్రామాకు తెరతీశారు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.

 ఇప్పటికే అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఓఎల్ఎక్స్ పీసులు

ఇప్పటికే అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఓఎల్ఎక్స్ పీసులు

సీఎం కేసీఆర్ నేనింతే నా బతుకింతే పేరుతో సొంత కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో రూపొందించిన సినిమాను ప్రగతి భవన్ లో చూపించి నమ్మించే ప్రయత్నం చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. అయితే కెసిఆర్ తీసిన సినిమాలో కొత్తదనం లేదని పేర్కొన్న బండి సంజయ్, కెసిఆర్ డ్రామా చూసి జనం అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. సినిమా అట్టర్ ప్లాప్ అన్నారు. కెసిఆర్ ఎన్ని డ్రామాలు ఆడినా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన కూతురు కవితను కాపాడుకోలేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఓఎల్ఎక్స్ పీస్ లని, ఇక వారిని కెసిఆర్ హీరోలుగా చూపించడంతో ఆయన సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

 కూతుర్ని కాపాడుకోవడం కోసమే నేనింతే నా బతుకింతే సినిమా తీసిన కెసిఆర్

కూతుర్ని కాపాడుకోవడం కోసమే నేనింతే నా బతుకింతే సినిమా తీసిన కెసిఆర్

కెసిఆర్ ఢిల్లీలో కూర్చొని మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనకు స్క్రిప్ట్ రాసుకున్నారని, ఢిల్లీ నుంచి రాగానే డిజిపి తో సమావేశమై ఫామ్హౌస్ డ్రామా నడిపించారని బండి సంజయ్ ఆరోపించారు. తన కుమార్తెను రక్షించుకోవడం కోసమే కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. కెసిఆర్ తీసిన నేనింతే నా బతుకింతే సినిమా కథ ఆవు మేత కథను గుర్తు చేస్తుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఇక ఆ సినిమా పెద్ద డ్రామా అని తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది అన్నారు.

 ఢిల్లీ వెళ్లి ఆర్టిస్టులను రెడీ చేసుకొని తిరిగొచ్చి పక్కా ప్లాన్ అట్టర్ ప్లాప్ సినిమా

ఢిల్లీ వెళ్లి ఆర్టిస్టులను రెడీ చేసుకొని తిరిగొచ్చి పక్కా ప్లాన్ అట్టర్ ప్లాప్ సినిమా

కెసిఆర్ డిప్రెషన్ లో ఉన్నారని ఆయన ఎందుకు భయపడుతున్నారో అందరికీ తెలుసని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ బిడ్డ కవిత లిక్కర్ కేసులో ఇరుక్కుపోవడం తో రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా జీవో విడుదల చేశారని, అయినప్పటికీ ఢిల్లీ సి.బి.ఐ ఈ కేసులో ఊరుకోదని ఎప్పుడైనా వచ్చి ఎంక్వయిరీ చేయొచ్చని, ఏ క్షణంలోనైనా కవిత అరెస్టు జరగవచ్చని, అందుకే ఈ డ్రామా మొదలు పెట్టాడని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దేశంలో నాయకులు ఎవరూ కెసిఆర్ ని నమ్మడం లేదని, రైతు సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసిన అన్ని రాష్ట్రాలకు వెళ్లి, అన్ని రాష్ట్రాలకు వెళ్లి తాను ఏదో చేస్తానని చెప్పుకున్నా ఎవరు నమ్మలేదని పేర్కొన్న బండి సంజయ్, అందుకే జనాలని నమ్మించి మోసం చెయ్యటం కోసం ఫామ్హౌస్ స్క్రిప్ట్ రాసుకుని ఢిల్లీకి వెళ్లి ఆర్టిస్టులను రెడీ చేసుకుని, తిరిగి వచ్చిన తర్వాత డీజీపీని, సీఎస్,సీపీలను పిలుచుకొని ఏ టైంలో ఏం జరగాలో చెప్పి ప్లాన్ చేసుకున్నాడని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

 నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ కు ఎందుకు వెళ్లారు?

నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ కు ఎందుకు వెళ్లారు?


అక్టోబర్ 26 వ తేదీన ఒక ఆణిముత్యం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారట. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులు ఫామ్హౌస్లో కెమెరాలు అమర్చారట. ఆపై ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ నకిలీ గ్యాంగ్ ను పిఎస్ కు తీసుకువెళ్లారు పోలీసులు.. కానీ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్టు చేసి తీసుకు పోలేదు అని ప్రశ్నించారు. ఫామ్హౌస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ కు ఎందుకు వెళ్లారు అని బండి సంజయ్ ప్రశ్నించారు. నలుగురు ఆణిముత్యాలు వెళ్లి నకిలీ గ్యాంగ్ ట్రాప్ లో చిక్కుకున్నారు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

 ఎమ్మెల్యేలు కొనుగోలు పై కేసీఆర్ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు ఎందుకు ఇవ్వలేదు?

ఎమ్మెల్యేలు కొనుగోలు పై కేసీఆర్ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు ఎందుకు ఇవ్వలేదు?

కూతురిని కొడుకుని రక్షించుకోవడానికి కెసిఆర్ ఏమైనా చేస్తారని పేర్కొన్న బండి సంజయ్ సంతలో పశువుల మాదిరిగా ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత బిజెపిలో చేర్చుకుంటున్నామని కానీ రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తన పార్టీ ఎమ్మెల్యేలపై కూడా కేసీఆర్ కు నమ్మకం లేదని బండి సంజయ్ ఆరోపించారు. నకిలీ గ్యాంగ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కెసిఆర్ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టులో ఎందుకు సమర్పించలేదో చెప్పాలన్నారు. ఇక ట్విట్టర్ టిల్లూ నలుగురు ఎమ్మెల్యేల కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎవరూ మాట్లాడొద్దని చెప్పాడని కేటీఆర్ ను టార్గెట్ చేశారు. మరి అలాంటప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడాడు? కోర్టును ధిక్కరించినట్టు కాదా అంటూ ప్రశ్నించారు బండి సంజయ్.

 కొప్పుల ఈశ్వర్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు?

కొప్పుల ఈశ్వర్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు?

ఒక లిక్కర్ కేసు మాత్రమే కాదు డ్రగ్స్ కేసు, కాళేశ్వరం, నయీమ్ డైరీ, మియాపూర్ భూముల ఫైల్స్ కూడా తీయబోతున్నారు .నువ్వు తల కిందకు కాళ్లు పైకి పెట్టిన నీ మాటలు నమ్మే వాళ్ళు ఎవరూ లేరు అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. కొప్పుల ఈశ్వర్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు బండి సంజయ్. ప్రోటోకాల్ తనకంటే ఎక్కువ ఉండ వద్దని కేటీఆర్ చెప్పడంతో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదని బండి సంజయ్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం పై ఇప్పటివరకు కెసిఆర్ ఎందుకు మాట్లాడలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+