బిజెపి అధికారంలోకి వస్తే పాతబస్తీ గల్లీగల్లీ 15నిమిషాల్లో జల్లెడ పడతాం: బండి సంజయ్ వార్నింగ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం పైన, ఎంఐఎం పార్టీ పైన నిప్పులు చెరుగుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలపై మండిపడుతున్న బండి సంజయ్ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెంచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ సర్కార్ ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడిన బండి సంజయ్ పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేకపోవడంతోనే వెయ్యి కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు.

అధికారంలోకి వస్తే పాత బస్తీని జల్లెడ పడతాం ..

అధికారంలోకి వస్తే పాత బస్తీని జల్లెడ పడతాం ..

ఈ క్రమంలో బండి సంజయ్ పాతబస్తీని ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామని ఎంఐఎం నాయకులన్నారని పేర్కొన్న బండి సంజయ్.. నేను చెబుతున్నా ఒవైసీ, కేసీఆర్! తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నిమిషాలు విద్యుత్ సిబ్బందికి పాతబస్తీని అప్పజెప్పుతాం. పాతబస్తీ గల్లీగల్లీలను జల్లెడపట్టి విద్యుత్ బకాయిలను వడ్డీతో సహా వసూలు చేస్తామని వెల్లడించారు.

విద్యుత్ బకాయిలలో అత్యధిక శాతం పాతబస్తీలోనే. వసూల్ చెయ్యండి

విద్యుత్ బకాయిలలో అత్యధిక శాతం పాతబస్తీలోనే. వసూల్ చెయ్యండి

నేను నా దేశం కోసం హిందూ ధర్మం కోసం బరాబర్ పని చేస్తానని ఇంతకుముందే బండి సంజయ్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో కరెంటు ఛార్జీలను పెంచడం వెనుక డిస్కమ్ లకు ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు ప్రధాన కారణమని బండి సంజయ్ ఆరోపించిన విషయం. అంతేకాదు ప్రజలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలలో అత్యధిక శాతం పాతబస్తీలోని ఉన్నట్టుగా బండి సంజయ్ పేర్కొన్నారు. అక్కడికి వెళ్లి విద్యుత్ బకాయిలను వసూలు చేయడం లేదని తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే పాతబస్తీను జల్లెడ పడతామని బండి సంజయ్ తేల్చిచెప్పారు.

కేంద్రం ధాన్యం విషయంలో క్లారిటీతో ఉన్నా రాజకీయం కోసం రాష్ట్రం కుట్రలు


టిఆర్ఎస్ పార్టీ దుర్మార్గాలపై పోరాటం చేస్తామని చెప్పిన బండి సంజయ్ ధాన్యం కొనుగోలు విషయంలో కూడా టిఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు, సీట్లు కొనడానికి సిద్ధంగా ఉన్న సీఎం కేసీఆర్ రైతులు పండించిన వరి ధాన్యం మాత్రం కొనబోమని చెబుతూ రైతులను నట్టేట ముంచుతున్నారు అని బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడానికి డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండికేస్తూ రాజకీయం చేస్తోందంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ పాలన చూసి అమరుల ఆత్మలు కూడా క్షోభ పడుతున్నాయి

సీఎం కేసీఆర్ పాలన చూసి అమరుల ఆత్మలు కూడా క్షోభ పడుతున్నాయి

మాట్లాడితే మతతత్వ మని ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తూ టిఆర్ఎస్ పార్టీ నేతలు లౌకిక వాదం అని చెప్పుకోవడం సిగ్గుచేటని బండి సంజయ్ భగ్గుమన్నారు. తాము హిందువులం అని సగర్వంగా చెప్పుకుంటామని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ పాలన చూసి అమరుల ఆత్మలు కూడా క్షోభ పడుతున్నాయని బండి సంజయ్ కెసిఆర్ ను టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+