లిక్కర్ స్కాంలో కేసీఆర్ ప్రమేయం, అందుకే ఢిల్లీ, పంజాబ్‌కు: షా చెప్పుల ఇష్యూపై బండి

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ పంజాబ్, ఢిల్లీ టూర్లు అందుకేనంటూ బండి సంజయ్

కేసీఆర్ పంజాబ్, ఢిల్లీ టూర్లు అందుకేనంటూ బండి సంజయ్

పంజాబ్‌లో లిక్కర్ సిండికేట్ చేసేందుకు కేసీఆర్ ఆ రాష్ట్రానికి వెళ్లినట్లు అనుమానం వస్తోందన్నారు బండి సంజయ్. ఢిల్లీ ఒబేరాయ్ హోటల్‌లో ఏం జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు లిక్కర్ మాఫియాకు సంబంధించిన వ్యక్తులను కలిశారా? లేదా? అని ప్రశ్నించారు. లిక్కర్ మాఫియా ఏర్పాటు చేసిన విమానంలో కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లింది నిజం కాదా? అని బండి సంజయ్ నిలదీశారు.

లిక్కర్ మాఫీయాతో కేసీఆర్ కుటుంబం బినామీలు: బండి

లిక్కర్ మాఫీయాతో కేసీఆర్ కుటుంబం బినామీలు: బండి

లిక్కర్ మాఫియాలో కాంగ్రెస్ వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోందన్నారు.టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే లిక్కర్ దందా చేస్తున్నారన్నారు. లిక్కర్ స్కాంపై సమగ్ర విచారణ జరిపితే నిజాలు బయటపడతాయన్నారు. లిక్కర్ మాఫియాతో కేసీఆర్ కుటుంబ సభ్యులకు బినామీలు అయిన రామచంద్ర పిళ్లై, శరత్, సృజన్, అభిషేక్‌లతో సంబంధాలున్నాయా? లేవా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ విషయంపై స్పందించేందుకు మంత్రి కేటీఆర్ ఎక్కడికి పోయారని? ఆయన ఎందుకు ట్వీట్ చేయలేదన్నారు బండి సంజయ్.

గురువు లాంటి వ్యక్తికి చెప్పులందిస్తే తప్పా అంటూ బండి సంజయ్

గురువు లాంటి వ్యక్తికి చెప్పులందిస్తే తప్పా అంటూ బండి సంజయ్

మరోవైపు, తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పులు ఇవ్వడంపై వస్తున్న ట్రోల్స్‌పైనా బండి సంజయ్ స్పందించారు. 'కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెద్దమనిషి.. ఆయనకు చెప్పులు తీసిస్తే తప్పేముంది' అని బండి సంజయ్​ అన్నారు. అమిత్ షా తమకు గురువు, తండ్రి లాంటి వారని.. అలాంటి వ్యక్తికి చెప్పులు అందిస్తే ఏంటని ప్రశ్నించారు బండి సంజయ్. అమిత్ షా లాంటి టచ్ చేస్తేనే అదృష్టంగా కార్యకర్తలు భావిస్తారన్నారు. పాదయాత్రలో తాను కూడా కొందరు కార్యకర్తలకు వారి చెప్పులు అందించానని తెలిపారు.

పాదాలు పట్టి లాగే అలవాటు మాది కాదంటూ బండి సంజయ్ కౌంటర్

పాదాలు పట్టి లాగే అలవాటు మాది కాదంటూ బండి సంజయ్ కౌంటర్

లిక్కర్ ఇష్యూను డైవర్ట్ చేసేందుకే షాకు చెప్పులు ఇచ్చింది ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రణబ్‌ ముఖర్జీ, నరసింహన్‌కు కాళ్లు మొక్కిన కేసీఆర్‌.. కోవింద్‌కు ఎందుకు మొక్కలేదంటూ దుయ్యబట్టారు. మేం పాదరక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తామని అన్నారు. మేం గులామ్‌లు కాదు.. మజ్లిస్‌కు సలాం కొట్టే వారసులు అసలే కాదు. అవసరం తీరాక పాదాలు పట్టి లాగే అలవాటు మాకు లేదు అంటూ బండి సంజయ్‌ కౌంటర్ ఇచ్చారు. ఐఏఎస్‌లు కేసీఆర్ కాళ్లు మొక్కినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

కేసీఆర్ కుటుంబ కమీషన్లతో వ్యాపారులు భయపడుతున్నారన్న బండి

కేసీఆర్ కుటుంబ కమీషన్లతో వ్యాపారులు భయపడుతున్నారన్న బండి

ఇది ఇలావుండగా, హైదరాబాద్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు, ఎంఐఎం గూండాలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు బండి సంజయ్. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఎవరూ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బిజినెస్‌మెన్లు ఇక్కడ వ్యాపారాలు చేయాలంటే భయపడుతున్నారన్నారు. ఒకవేళ బిజినెస్ చేస్తే కేసీఆర్ కుటుంబానికి వాటాలు, కమీషన్లు ఇవ్వాల్సి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం అని ..టీఆర్ఎస్ ప్రభుత్వానికి చమరగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్‌ను అభినందించేందుకే అమిత్ షా భేటీ

ఎన్టీఆర్‌ను అభినందించేందుకే అమిత్ షా భేటీ

ఇటీవల విడుదలైన చిత్రాన్ని చూసిన కేంద్రమంత్రి అమిత్ షా.. అందులో నటించిన జూనియర్ ఎన్టీఆర్‌ను అభినందించారని బండి సంజయ్ తెలిపారు. రాజకీయంగా ఎలాంటి చర్చా జరగలేదని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పిన విషయం తెలిసిందే. అమిత్ షా-ఎన్టీఆర్ మధ్య చిత్రానికి సంబంధించిన చర్చే జరిగిందని, రాజకీయాల గురించి ఎలాంటి చర్చా జరగలేదని తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నారన్నారు. ఆనాడు టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లిన తీరు గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+