హైదరాబాద్ నడిబొడ్డున సీక్రెట్ వ్యూ పాయింట్.. సన్ రైజ్, సన్ సెట్ ఇక్కడినుంచి చూస్తే ఫుల్ కిక్కు..
హైదరాబాద్ వాసులు నిత్యం ఉద్యోగాలు, ఉపాధి అంటూ ఉరుకులు, పరుగుల జీవితం గడుపుతారు. అటు విద్యార్థులు సైతం స్కూళ్లు, కాలేజీలు అంటూ బిజీగా ఉంటారు. ఈ క్రమంలో కాస్త సమయం దొరికినా సినిమాలకు, టూర్ లకు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక కొంతమంది నగరం నుంచి కేవలం సన్ రైజ్, సన్ సెట్ చూసేందుకు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తుంటారు. మరికొంతమంది దగ్గర్లోని ఉస్మాన్ సాగర్, ఉస్సేన్ సాగర్ తీర ప్రాంతానికి వెళ్తారు. నిజానికి హైదరాబాద్ లో సూర్యాస్తమయం, సూర్యోదయం విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి ప్రత్యేకమైన వాతావరణం కారణంగా క్షుణ్ణంగా గమనించిన వారికే ఆ అనుభూతి కలుగుతుంది.
అయితే హైదరాబాద్ లోని సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు ఎక్కడికో ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేదు. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డునే అందరినీ ఆశ్చర్యపరిచేలా ఓ సీక్రెట్ వ్యూ పాయింట్ బయటపడింది. ఆ వ్యూ పాయింట్ చాలా మందికి తెలియదు. కానీ మీరు ఇక్కడికి చేరుకుంటే చాలు భాగ్యనగరంలోని అద్భుతమైన సూర్యాస్తమయం, సూర్యోదయంను తనివితీరా ఆస్వాధించొచ్చు. అలాగే హైదరాబాద్ సిటీ మొత్తం మీ కళ్ల ముందు కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ ఎక్కడో లేదు.. హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ లో ఇది ఉంది. ఇక ఇక్కడికి చేరుకోవడం కూడా ఈజీనే..

బంజారాహిల్స్ రోడ్ 12, ఎంఎల్ఏ కాలనీకి దగ్గర్లో ఉన్న ఈ వ్యూ పాయింట్ ను స్థానికులు హుడా హైట్స్ వ్యూ పాయింట్ అని పిలుస్తున్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు అలా సులభంగా ఇక్కడకు చేరుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(HUDA) అభివృద్ధి చేసింది. అలాగే ఈ ప్రాంతం ఎత్తులో ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని హుడా హైట్స్ వ్యూ పాయింట్ అని పిలుస్తుంటారు. ఇక ఈ వ్యూ పాయింట్ కు చేరుకోగానే ఎదురుగానే కేబీఆర్ పార్కు కనిపిస్తుంది. అలాగే ఎదురుగా హైటెక్ సిటీ స్కై లైన్, ఐకానిక్ కోహినూర్ బిల్డింగ్ మనకు కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ అక్కడ స్థానికులకు మాత్రమే సుపరిచితం.. నగరంలోని చాలా మందికి ఈ ప్రదేశం గురించి తెలియదు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ట్రై చేయండి..












Click it and Unblock the Notifications