భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!

మందు బాబులకు షాక్. బీర్ల ధరలకు భారీగా పెరుగుతున్నాయి. ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో కంపెనీలకు మార్జిన్ ఖర్చులు తగ్గుతున్నాయి. దీంతో తక్షణమే ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్దం అయ్యాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే బీర్ల ఉత్పత్తికి ఖర్చు 15 శాతం పెరిగింది. కాగా, ఇదే సమయంలో విదేశీ బ్రాండ్ల ఉత్పత్తుల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా అమ్మకాలు భారంగా మారుతున్నాయి. దీంతో.. బీర్ల ధరల పెంపు కు రంగం సిద్దం చేసారు. కొత్త ధరలు ఫిక్స్ అయ్యాయి.

బీర్ల ధరల పెంపుకు రంగం సిద్దమైంది. బీర్ల ఉత్పత్తి ధరలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ఆ భారం కొనుగోలు దారుల పైన మోపేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. ధరలను పెంచక తప్పద ని బ్రూవర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఉత్పత్తి ట్యాక్సులు, ఇతర ఖర్చులు పెరగడంతో బీర్ల తయారీ కంపెనీలు సతమతమవుతున్నాయి. పన్నుల కారణంగా ఉత్పత్తి ఖర్చులు 12 నుంచి 15 శాతం వరకు పెరిగాయని, కంపెనీలపై అదనపు భారం పడుతుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో బీరు సీసాల ధరలు ధరలు 20 శాతం పెరిగాయి. ఇక ఇతర మెటిరీయల్ ఖర్చులు కూడా 20 నుంచి 25 శాతం పెరిగాయి. రవాణా ఖర్చులు కూడా 10 శాతం మేర పెరిగటంతో.. బీర్ల ధరల పెంపు అనివార్యంగా మారిందని చెబుతున్నారు. ప్రధానంగా ఏబీ ఇన్‌బెవ్, కార్ల్‌బర్గ్ కంపెనీలు 85 శాతం బీర్ అమ్మకాలను చేపడుతున్నాయి.

beer-prices-are-expected-to-rise-by-12-15-and-supplies-may-tighten-in-the-coming-weeks-here-the-de

ప్రతిపాదనలు సిద్దం చేసిన తయారీ కంపెనీలు

ఇలా అన్ని రకాలుగా ఖర్చులు పెరుగుతుండటంతో బీర్ల ధరలను పెంచాలని కంపెనీలు తాజాగా ప్రతిపాదనలు సమర్పించాయి. ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో కంపెనీలకు మార్జిన్ ఖర్చులు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీ బీర్ కేస్‌పై రూ.20 మేర ధరను పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలకు ఈ అంశం పైన ప్రతిపాదనలు సమర్పించారు. రేట్లు పెంపు పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని.. అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇరాన్ - ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో ఇప్పటికే ఇండియాలో చమురు సంక్షోభం మొదలైంది.

మరోవైపు ఔషధాల ధరలు కూడా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో ఇండియన్స్‌కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. విదేశీ బ్రాండ్లు తమ బీర్ల ధరలు పెద్ద మొత్తంలో పెరగనున్నాయి. లాస్ బాటిల్ ధరలు 20 శాతం పెరిగాయి. అలాగే, బీర్లను ఉంచే పేపర్ కార్టన్ రేట్లు కూడా రెట్టింపైనట్లు తయారీ కంపెనీలు చెబుతున్నాయి. లేబుల్స్, టేప్స్ వంటి ధరలు కూడా పెరిగాయి. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా లేకపోవడంతో వీటన్నింటి తయారీ సంస్థలు తమ తయారీని తగ్గించాయి. వేసవి కాలం కావడం, డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తమపై భారం తగ్గాలంటే 12 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచాలని కోరుతున్నాయి. దీంతో, ఒకటి రెండు రోజుల్లో బీర్ల ధరల పైన అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+