పవన్ కళ్యాణ్Xఅల్లు అర్జున్, ఫ్యాన్స్ ఆగ్రహం: అక్కడే తేడా వచ్చిందా?

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడను బ్రదర్.. అది తప్ప ఏదైనా అడగండని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.

దీంతో అసలు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య ఎక్కడ తేడా వచ్చిందనే ప్రశ్న చాలామందిలో తలెత్తింది. 'పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను బ్రదర్..' అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి. అంతేకాదు, ఆయన వ్యాఖ్యల పైన పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, అల్లు అర్జున్ ఆగ్రహానికి కారణం ఏమిటనే చర్చ కూడా సాగుతోంది. అంతకుముందు పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా డ్యాన్సు పైన వ్యాఖ్యానించారు.

Behind Allu Arjun comment on Pawan Kalyan?

తాను రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లా డ్యాన్సులు చేయలేనని చెప్పారు. ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌కు కోపం తెప్పించి ఉంటాయని అంటున్నారు. డ్యాన్స్ అంటే పైవారితో పాటు అల్లు అర్జున్ పేరు కూడా వినిపిస్తోంది. పవన్ తన పేరు చెప్పకపోవడం అల్లు అర్జున్‌కు ఆగ్రహం తెప్పించిందా అనే చర్చ సాగుతోంది.

మరో వాదన కూడా వినిపిస్తోంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం సమయంలోనే అల్లు కుటుంబానికి, పవన్ కళ్యాణ్‌కు మధ్య విభేదాలు ఉన్నాయని, బహుశా అందుకే బన్నీ అలా మాట్లాడి ఉంటారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. 18 స్థానాలు గెలుచుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం పవన్ కళ్యాణ్‌కు నచ్చలేదనే విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+