బెంగళూరు ORR vs హైదరాబాద్ ORR.. సోషల్ మీడియాలో రచ్చరచ్చ..!

దక్షిణాదిలో హైదరాబాద్, బెంగళూరు రెండు ప్రధాన నగరాలుగా ఉన్నాయి. అయితే ఇరు నగరాల మధ్య సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. ట్రాఫిక్, టెక్ వ్యాల్యూస్, బిర్యానీ.. ఇలా ప్రతీదాంట్లో ఈ రెండు నగరాలు పోటీ పడుతుంటాయి. ఇటీవల బెంగళూరును కాదని నెట్ ఫ్లిక్స్ సంస్థ.. దేశంలోనే ముంబై తర్వాత తన రెండో కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినప్పుడు కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. బెంగళూరులో ట్రాఫిక్, పాట్ హోల్స్ కారణంగా నెట్ ఫ్లిక్స్ వెళ్లిపోయిందని కొందరు కామెంట్స్ చేశారు.

ఇప్పుడు మరో పోస్టు రెడ్డిట్ లో ప్రత్యక్షమైంది. అదే బెంగళూరు ORR vs హైదరాబాద్ ORR.. ప్రస్తుతం రెండు నగరాల ఔటర్ రింగ్ రోడ్లపై నెట్టింట చర్చ నడుస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి పెట్టిన ఈ పోస్టుకు వేల సంఖ్యలో రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు హైదరాబాద్ ను సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు బెంగళూరును సపోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో 8 లేన్ రోడ్లు ఉండగా బెంగళూరులో జీరో లేన్ రోడ్లు ఉన్నాయని.. అలాగే హైదరాబాద్ లో స్మూత్ రోడ్లు ఉండగా..

Bengaluru s ORR Nightmare vs Hyderabad s Dream Drive Who Wins the Traffic Throne

బెంగళూరులోని రోడ్లపై గుంతలు ఉన్నాయని.. ఇక హైదరాబాద్ రోడ్లు శుభ్రంగా ఉంటే.. బెంగళూరు రోడ్లు మాత్రం చెత్తతో నిండిపోయాయని ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో ఈ విధంగా పోస్టు పెట్టాడు. మరో నెల రోజుల వ్యవధిలో గ్రేటర్ బెంగళూరు అథారిటీ.. సిలికాన్ సిటీకి న్యాయం చేస్తుందని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఓఆర్ఆర్ వివాదంపై సామాజిక మాధ్యమాల్లో చాలా సరదాగా కామెంట్స్ , రియాక్షన్స్ పెట్టుకుంటున్నారు. మరో యూజర్.. బెంగళూరు ఓఆర్ఆర్.. హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే 14 ఏళ్ల ముందే నిర్మించారని కామెంట్ పెట్టాడు.

బెంగళూరులోని ఇబ్లూర్ ప్రాంతంలో చూడండి. మైసూర్ రోడ్డు వద్ద వెస్ట్ ఓఆర్ఆర్ రోడ్డు, నగర్ భావి ప్రాంతాల్లో రోడ్లు డీసెంట్ అని మరొకరు కామెంట్ పెట్టారు. మరో వ్యక్తి కామెంట్ చేస్తూ.. బెంగళూరు ఓఆర్ఆర్ ఇప్పుడు ఓఆర్ఆర్ కాదని.. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు అని తెలిపాడు. మరోవ్యక్తి మాత్రం.. హైదరాబాద్.. బెంగళూరు కంటే 20 శాతం చీప్ అని.. ఇక్కడి ప్రజలు ఫ్రెండ్లీగా ఉంటారని.. హైదరాబాద్ రోడ్లు బాగుంటాయని అన్నాడు. కానీ అవకాశాలు, స్టార్ట్ అప్ కల్చర్, మిగతా విషయాల్లో బెంగళూరు ముందుంటుందని కామెంట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+