భద్రాచలంలో అద్భుతం.. బాల 'హనుమంతుడు' పుట్టాడు..!

భద్రాద్రి రామయ్య కొలువై ఉన్న భద్రాచలంలో అద్భుతం జరిగింది. ఓ మహిళ 5.2 కేజీల బరువుతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. ప్రభుత్వాసుపత్రిలోని వైద్యులు అతి కష్టం మీద శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. 5.2 కేజీల బరువుతో పుట్టిన ఈ మగ శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. అయితే ఇంతటి భారీ బరువున్న శిశువు జన్మించడం స్థానికంగా పెను సంచలనంగా మారింది.

అప్పుడే పుట్టిన ఆరోగ్యకరమైన శిశువు సాధారణంగా 2.5 కిలోల నుండి 3.5 కిలోల వరకు బరువు ఉంటుంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అరుదైన ఘటన జరిగింది. పురిటి నొప్పులతో ప్రభుత్వాసుపత్రిలో చేరిన సంథ్యారాణి అనే మహిళ ఏకంగా 5 కేజీల 200 గ్రాముల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. ఇంత బరువున్న శిశువు పుట్టడం స్థానికంగా సంచలనంగా మారింది. ప్రభుత్వాసుపత్రిలోని వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇంతటి బరువున్న శిశువు జన్మించడం చాలా అరుదుగా జరుగుతుంటుందని అన్నారు.

Bhadrachalam Area Hospital s Big Blessing 5 2 kg Giant Baby Arrives Safely A True Medical Wonder

అయితే ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి అరుదైన కేసులను సమర్థవంతంగా డీల్ చేయడం పట్ల ఆసుపత్రి వర్గాలు , రోగి బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతటి బరువున్న బిడ్డ పుట్టడం స్థానికంగా సంచలనంగా మారింది. దాంతో స్థానికులు బాల బీముడు పుట్టాడు, బాల హనుమంతుడు పుట్టాడు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+