భాను కిరణ్ తరలింపునకు కోర్టు అనుమతి: ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు
హైదరాబాద్: మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌ను చర్లపల్లి జైలు నుంచి చంచల్‌గుడా జైలుకు తరలించేందుకు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు శనివారంనాడు అనుమతి ఇచ్చింది. భాను కిరణ్‌ను చంచలగుడా జైలుకు తరలించాలని ఇటీవల చర్లపల్లి జైలు అధికారులు కోర్టును కోరిన విషయం తెలిసిందే.
ప్రాణహాని ఉన్న కారణంగా భాను కిరణ్‌కు ప్రత్యేక బ్యారక్‌ను ఏర్పాటు చేయనున్నారు. గత నాలుగేళ్లుగా భాను కిరణ్ చర్లపల్లి జైలులో ఉంటున్నాడు. భాను కిరణ్‌ను చర్లపల్లి జైలు నుంచి తరలించాలని స్వయంగా జైలు సూపరిండెంట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జైలు నుంచి భాను కిరణ్ దందాలు నిర్వహించడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ పిటిషన్ రేపు శుక్రవారం విచారణకు రానుంది. ఇటీవల వెలుగు చూసిన ఓ దందాలో భాను కిరణ్ ప్రమేయం ఉన్నట్లు బయటపడిందని అంటున్నారు. చంచల్‌గూడా జైలులో ప్రత్యేక బ్యారక్‌లు ఉన్నందున భాను కిరణ్‌ను అక్కడికి మార్చాలని చర్లపల్లి జైలు అధికారులు కోరారు.

గతంలో చంచల్‌గుడా జైలులో బ్యారక్‌లు లేనందున భాను కిరణ్‌ను చర్లపల్లి జైలుకు పంపించారని, ఇప్పుడు బ్యారక్‌లు అందుబాటులో ఉన్నాయని వారు వాదిస్తున్నారు. చంచల్‌గుడా జైలులో 200 బ్యారక్‌లు ఉన్నాయని, ఆ జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని వారు అంటున్నారు.
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భాను కిరణ్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆ కేసుతో పాటు అతనిపై పలు కేసులు కూడా ఉన్నాయి. వాటి విచారణ సందర్బంగా భాను కిరణ్‌ను వివిధ కోర్టులకు తరలించి, తిరిగి తీసుకుని రావాల్సి ఉంటుంది.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications