మంచు కుటుంబంలో చిచ్చు పెట్టిన ఎమ్మెల్యే చెల్లెలు..?
మంచు కుటుంబం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. గత మూడు, నాలుగు రోజుల నుంచి మంచు కుటుంబం గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరాయి.మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య ఆస్తి తగదాలు ఏర్పడ్డాయి. దీంతో జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.మనోజ్ తన భార్యతో భూమా మౌనికతో కలిసి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడున్న సిబ్బంది ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో అక్కడ ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగారు. ఈ తతంగం మొత్తం చూసిన మోహన్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే తండ్రి మోహన్ బాబును పెద్ద కుమారుడు మంచు విష్ణు ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మోహన్ బాబును చేర్పించారు. దీంతో వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. అయితే మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణం మనోజ్ భార్య భూమా మౌనిక అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకోవడమే మంచు ఫ్యామిలీకి ఇష్టం లేదని తెలుస్తోంది.

భూమా మౌనికను వివాహం చేసుకున్న సమయంలో మంచు ఫ్యామిలీ ఎవరూ కూడా పెద్దగా కనిపించలేదు. మంచు లక్ష్మీ ఒక్కరే మనోజ్ పెళ్లి చేయడం జరిగింది. అన్న మంచు విష్ణు అయితే పెళ్లికి కూడా హాజరకాలేదు.మోహన్ బాబు దంపతులు మాత్రం పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే ఆ తర్వాత భూమా మౌనిక మాటలు విని మనోజ్ సొంత ఫ్యామిలీపై తిరగపడ్డారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆస్తి విషయంలో వీరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని సమాచారం.
మోహన్ బాబు ఇంటి పని మనిషి సైతం ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. మనోజ్‌పై మోహన్ బాబు సైతం ఇదే తరహా వ్యాఖ్యాలు చేశారు. మోహన్ బాబు మాటల్లో మనోజ్ భార్య భూమా మౌనిక వల్లే ఇదింతా జరిగిందనే అర్ధం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఆమె వల్లే ఈ గొడవ జరిగిందని తెలుస్తోంది. భూమా మౌనికను టార్గెట్ చేసుకుని మోహన్ బాబు మనోజ్‌పై మండిపడ్డారు. భార్య మాటలు విని మనోజ్ ఇప్పుడు సొంత తండ్రి మీదే దాడి చేశారనే మాటలు వినిపిస్తున్నాయి.
మనోజ్, భూమా మౌనికలకు ఇది రెండో వివాహమే. ఇద్దరూ కూడా తమ మొదటి లైఫ్ పార్ట్‌నర్లకు విడాకులిచ్చి రెండో వివాహం చేసుకున్నారు. భూమా మౌనిక టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు సొంత చెల్లెలు. భూమా మౌనిక మొదటి భర్తతో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబు ఇప్పుడు మనోజ్, భూమా మౌనికల దగ్గరే ఉంటున్నాడు. ఇక వీరిద్దరికి ఇటీవలే ఓ పాప జన్మనిచ్చింది.












Click it and Unblock the Notifications