వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గండ్ర Vs గండ్ర: అందుకే టిఆర్ఎస్‌లోకి, కొంపముంచిన రేవంత్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో టిడిపికి చెందిన నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ తెలంగాణలో టిడిపిని మరింత నష్టపర్చింది. అయితే రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా స్థబ్దుగా ఉన్న నేతలు స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీలను ఎంచుకొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన టిడిపి నేతలు బుదవారం నాడు టిఆర్ఎస్‌లో చేరారు.

Recommended Video

Revanth Reddy : ఓ వైపు రేవంత్, మరో వైపు విజయశాంతి ప్రచారం | Oneindia Telugu

రాజీనామాపై రేవంత్ మౌనం: గెలిస్తే మైలేజీ, ఓడిపోతే కాంగ్రెస్‌కు నష్టంరాజీనామాపై రేవంత్ మౌనం: గెలిస్తే మైలేజీ, ఓడిపోతే కాంగ్రెస్‌కు నష్టం

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ తర్వాత టిడిపి నేతలపై కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతలు కేంద్రీకరించారు. బలమైన నేతలను తమ పార్టీల్లోకి ఆహ్వనించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాము ఏ పార్టీలో చేరితే రాజకీయంగా ప్రయోజనమనే విషయాలను బేరీజు వేసుకొన్న తర్వాత తెలుగు తమ్ముళ్ళు టిడిపిని వీడుతున్నారు.

రంగంలోకి హరీష్: రేవంత్‌పై కెసిఆర్ మైండ్‌గేమ్రంగంలోకి హరీష్: రేవంత్‌పై కెసిఆర్ మైండ్‌గేమ్

తెలంగాణలో టిడిపి తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వంతో ఇంఛార్జీలను ఏర్పాటు చేయాల్సి ఉంది.

మోత్కుపల్లి: రేవంత్‌కు చెక్‌ కోసమే టిఆర్ఎస్ పొత్తు, ఒంటరి పోరేనా?మోత్కుపల్లి: రేవంత్‌కు చెక్‌ కోసమే టిఆర్ఎస్ పొత్తు, ఒంటరి పోరేనా?

 టిఆర్ఎస్‌లో చేరిన గండ్ర సత్యనారాయణరావు

టిఆర్ఎస్‌లో చేరిన గండ్ర సత్యనారాయణరావు


వరంగల్ జిల్లా భూపాలపల్లి అసెంబ్లీ ఇంఛార్జీ గండ్ర సత్యనారాయణ రావు టిడిపిని వీడి టిఆర్ఎస్‌లలో చేరారు. రేవంత్‌రెడ్డితో పాటే గండ్ర సత్యనారాయణరావు కూడ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. కొన్ని పరిస్థితుల కారణంగా గండ్ర సత్యనారాయణరావు టిఆర్ఎస్‌లో చేరారు.బుదవారం నాడు గండ్ర సత్యనారాయణరావు తన అనుచరులతో కలిసి టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు. భూపాలపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్‌కు గండ్ర సత్యనారాయణరావు చుక్కలు చూపించారు. దీంతో అధికార పార్టీ గండ్ర సత్యనారాయణరావుతో కొంత కాలంగా చర్చలు జరుపుతోంది. ఎట్టకేలకు ఈ చర్చలు సఫలమై గండ్ర సత్యనారాయణరావు టిఆర్ఎస్‌లో చేరారు

కరీంనగర్ జిల్లా నేతలు కూడ టిఆర్ఎస్‌లో చేరిక

కరీంనగర్ జిల్లా నేతలు కూడ టిఆర్ఎస్‌లో చేరిక

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు కూడ టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.మంథని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్లా జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నరసింగ రావులు బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కొంతకాలంగా వీరంతా టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు గండ్ర సత్యనారాయణరావుతో పాటు వీరు కూడ టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.

గండ్ర సత్యనారాయణరావు ఎందుకు వెళ్ళలేదంటే?

గండ్ర సత్యనారాయణరావు ఎందుకు వెళ్ళలేదంటే?


భూపాలపల్లి అసెంబ్లీ స్థానం నుండి స్పీకర్ మధుసూధనాచారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రం నుండి ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ప్రాతినిథ్యం వహించారు.అయితే గండ్ర వెంకటరమణారెడ్డిని కాదని గండ్ర సత్యనారాయణరావుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇచ్చే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. అయితే మధుసూధనాచారిని కాదని టిఆర్ఎస్ టిక్కెట్టు గండ్ర సత్యనారాయణావుకు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే నామినేటేడ్ పదవిని టిఆర్ఎస్ ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతోంది.

కొంపముంచిన రేవంత్

కొంపముంచిన రేవంత్

తెలంగాణలో రేవంత్‌రెడ్డి టిడిపిని తీవ్రంగా నష్టపర్చారని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమైన 16 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరే కాకుండా ఇతర నాయకులు కూడ తెలంగాణలో టిడిపి పుంజుకొనే పరిస్థితి ఉండదనే భావనతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. తెలంగాణలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ నాయకత్వం బాధ్యతలు రేవంత్‌కు అప్పగించింది. అయితే అదే సమయంలో కీలకమైన నేతలను రేవంత్ తనతో పాటు తీసుకెళ్ళగలిగారు.టిడిపిలో తక్కువ సమయంలోనే అత్యున్నతస్థాయి పదవిని అందుకొన్నారు. అంతే త్వరగా పార్టీని వీడారు. అంతేకాదు పార్టీని తీవ్రంగా నస్టపర్చారని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

English summary
Telugu Desam Party district president Gandra Satyanarayana Rao resigned from the primary membership of the party and joined the Telangana Rashtra Samithi on Wednesday. This has struck another blow to the TDP that once was a strong party in the erstwhile undivided Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X