ప్రొడ్యూసర్లకు బిగ్ షాక్.. తెలంగాణాలో బెనిఫిట్ షోలు రద్దు చెయ్యమన్న హైకోర్టు!
తెలంగాణ రాష్ట్రంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టు భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ తేల్చి చెప్పింది. సినిమా టికెట్ల ధరల పెంపు, స్పెషల్ బెనిఫిట్ షోలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్ కు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది.
హైకోర్టులో సినిమా టికెట్ ధరలు, బెనిఫిట్ షోల విషయంలో వాదనలు
ప్రభుత్వం తరఫున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ సంక్రాంతి సమయంలో సినిమా టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ప్రభుత్వం తరపు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం పిటీషనర్ తరపు వాదనలు కూడా వింది.

సినిమాటోగ్రఫీ యాక్ట్ గురించి చెప్పిన హైకోర్టు
గేమ్ చేంజర్ మూవీ టికెట్ల రేట్ల పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా దీనికి స్పందించిన ప్రభుత్వ న్యాయవాది సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం సినిమాటోగ్రఫీ ఆక్ట్ ప్రకారం అర్ధరాత్రి 1.30 నిమిషాల నుంచి ఉదయం 8.40 నిమిషాల వరకు గల మధ్య సమయంలో ఎటువంటి ప్రత్యేకహోదా అనుమతి లేదని పేర్కొంది.
విచారణ ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా
సినిమాటోగ్రఫీ చట్టాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసుపై తదుపరి విచారణను ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది. ఇక తాజాగా హైకోర్టు ఇచ్చిన కొత్త ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలో ముందు ముందు బెనిఫిట్ షోలు, టికెట్లరేట్లు పెంచడం రద్దయినట్టుగా తెలుస్తోంది. మొదట సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలకు టికెట్లరేట్లు పెంపు బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వద్దని పేర్కొన్న హైకోర్టు
ఆ తరువాత రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకి టికెట్లు ధరలను పెంచుతూ అనుమతులను ఇవ్వడం పైన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పైన వాదనలు జరగగా నిర్మాతలకు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వద్దని పేర్కొంది.












Click it and Unblock the Notifications