Bigg Boss 5 Telugu: చెంప పగలగొడతానంటూ వార్నింగ్: దెబ్బకు హౌస్ నుంచి అవుట్

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఎలిమినేషన్‌ డే వచ్చేసింది. మరో కంటెస్టెంట్ బిగ్‌బాస్ హౌస్ నుంచి తన ఇంటికి వెళ్లిపోనున్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే హాట్ డిబేట్‌‌గా మారింది. ఇప్పటిదాకా వరుసగా తొలి మూడు వారాల్లో ముగ్గురు విమెన్ కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు. నాలుగో వారం దీనికి బ్రేక్ పడింది. ఫోర్త్ ఎలిమినేటర్‌గా నటరాజ్ మాస్టర్ నిలిచాడు. ఆ తరువాత అయిదు, ఆరో వారం కూడా మళ్లీ ఫిమేల్ కంటెస్ట్ంట్ ఈ షో నుంచి ఎవిక్ట్ అయ్యారు.

ఎలిమినేషన్ లిస్ట్‌లో

ఎలిమినేషన్ లిస్ట్‌లో


ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. వీక్షకులు వారిని పెద్దగా ఆదరించలేదు. ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు పడలేదు. అలాంటి కంటెస్టెంట్ ఒకరు ఈ సెవెన్త్ వీక్ బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవిక్ట్ కానున్నారు. ఆ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరనేది అధికారికంగా ఈ రాత్రికి తేలిపోతుంది. ఆ కంటెస్టెంట్ ఎవరనేది మాత్రం ముందే లీక్ అయింది. ఈ వారం కూడా ఫిమేల్ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎవిక్ట్ అవుతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

సేఫ్ జోన్‌లో ఎవరు?

సేఫ్ జోన్‌లో ఎవరు?

ఈ వారం మొత్తంగా ఎనిమిది మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, లోబో, ఆర్జే కాజల్, జెస్సీ, ప్రియ, ఆనీ మాస్టర్, యాంకర్ రవి, సిరి హన్మంతు ఉన్నారు. వారిలో శ్రీరామచంద్ర, ఆర్జే కాజల్ ఇప్పటికే సేఫ్ అయ్యారు. శనివారం రాత్రి నాటి ఎపిసోడ్‌లో వారిద్దరూ సేఫ్ జోన్‌లోకి వెళ్లారు. ఇక మిగిలిన ఆరుమందిలో ఎవరు హౌస్‌లో కంటిన్యూ అవుతారు?, ఎవరు బయటికి వెళ్తారనేది ఈ రాత్రికి తెలిసిపోతుంది.

 ఈ వారం కూడా ఫిమేల్ కంటెస్టెంట్..

ఈ వారం కూడా ఫిమేల్ కంటెస్టెంట్..

సోషల్ మీడియాలో లీక్ అయిన సమాచారాన్ని బట్టి చూస్తే ఈ వారం ప్రియ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడో వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. వీజే సన్నీ, ప్రియ మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం, హాట్ హాట్ డిబేట్.. ఆమె ఎలిమినేషన్‌కు కారణమైనట్లు చెబుతున్నారు. బంగారు కోడిపెట్ట టాస్క్ సందర్భంలోనూ వీజే సన్ని, ప్రియ మధ్య గొడవలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుడ్లను దొంగిలించడానికి వచ్చిన ప్రియను వీజే సన్నినెట్టేయగా, చెంప పగలగొడతానంటూ వార్నింగ్‌ ఇచ్చారు. కొట్టుకునేంతవరకు వెళ్లింది వారిద్దరి మధ్య గొడవ. ఇదంతా ప్రియకు నెగెటివ్‌గా మారిందనే అంచనాలు ఉన్నాయి.

చెంపపగులగొట్టడంపై

చెంపపగులగొట్టడంపై

తన గుడ్లను కాపాడుకునే ప్రయత్నంలో సన్నీ.. ప్రియ‌ను ప‌క్క‌కు నెట్టేయ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఓ రేంజ్ వార్ న‌డిచింది. ఒక దశలో ప్రియా- పక్కనే ఉన్న పూల‌కుండీని స‌న్నీపైకి ఎత్తారు. ఫిజిక‌ల్‌గా ఆడకూడదంటూ ప్రియ వార్నింగ్ సైతం ఇచ్చారు. ఫిజిక‌ల్‌గా ఆడటాన్ని సన్నీ సమర్థించుకున్నాడు. తనను తాను ప్రొట‌ెక్ట్ చేసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. దీనితో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. చెంప పగిలగొడతానంటూ హెచ్చరించారు ప్రియ. ప్రియ ప‌దే ప‌దే స‌న్నీని దూషిస్తుండ‌గా, దమ్ముంటే కొట్టు అని సన్నీ ఆమెపైకి దూసుకెళ్లాడు.

నాగార్జున కూడా అభ్యంతరం..

నాగార్జున కూడా అభ్యంతరం..

శనివారం రాత్రి నాటి ఎపిసోడ్‌లోనూ హోస్ట్ అక్కినేని నాగార్జున.. ఈ విషయాన్ని ప్రస్తావించారు. చెంప పగులగొడతాను అంటూ ఎన్నిసార్లు చెబుతారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ఆమె ఇచ్చిన వివరణ పట్ల నాగార్జున పెద్దగా సానుకూలంగా స్పందించలేదు. పైగా- సన్నీని సమర్థించాడు. అసలేంటా ఫైర్.. ఎక్కడి నుంచి వచ్చింది? బాగా ఆడావ్ అంటూ మెచ్చుకున్నాడు. ఆ సమయంలో సన్నీ.. ప్రియను ఈ వారం వరస్ట్ పెర్‌ఫార్మర్‌గా అని చెప్పాడు. దీనికి బదులుగా ఆమె సన్నీని గాల్లో ముద్దులు పెట్టింది. సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన లోబో కూడా ప్రియను డూప్‌గా అభివర్ణించాడు. ఇవన్నీ వెరసి ఈ వారం ప్రియకు నెగెటివ్ రిమార్క్స్ పడేలా చేశాయి.

పూలకుండీ ఎత్తడాన్ని సెట్ ప్రాపర్టీ డ్యామేజ్..

పూలకుండీ ఎత్తడాన్ని సెట్ ప్రాపర్టీ డ్యామేజ్..

కిందటివారం టాస్క్ సందర్భంగా శ్వేతా వర్మ, లోబో.. సెట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారనే చెడ్డపేరును తెచ్చుకున్నారు. ఈ విషయంలో హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా వారి మీద ఫైర్ అయ్యారు. హౌస్‌లోని కుష‌న్స్‌ను చింపేసి అందులోని దూదిని వాడి బొమ్మ‌లు త‌యారు చేశారు వారిద్దరూ. నిజానికి అది యాంకర్ రవి ఐడియా. దీనితో శనివారం నాటి ఎపిసోడ్‌లో ఈ విషయంలో శ్వేతా వర్మ, రవి మధ్య డిబేట్ కూడా సాగింది. ఈ వారం కూడా సెట్ ప్రాపర్టీ డ్యామేజ్ అంశం తెరమీదికి వచ్చింది. సన్నీ మీదికి ప్రియ పూలకుండీ ఎత్తడాన్ని సెట్ ప్రాపర్టీ డ్యామేజ్‌గా బిగ్‌బాస్ పరిగణించాడని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+