Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అల్లు అర్జున్ కోసం మొన్న వైసీపీ - నేడు బీజేపీ, బీఆర్ఎస్..!!

అల్లు అర్జున్ అరెస్ట్ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో సీఎం రేవంత్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని వ్యాఖ్యానించారు. పుష్ఫ -2 విడుదల సమయంలో అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ప్రచారం వేళ వైసీపీ కేడర్ అండగా నిలిచి మద్దతు ప్రకటించింది. ఇప్పుడు అరెస్ట్ వేళ తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి సపోర్ట్ అందుతోంది. కేటీఆర్ ఇప్పటికే అరెస్ట్ ను తప్పుబట్టగా..తాజాగా బీజేపీ స్పందించింది.

ఏపీలో ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్ధి శిల్పా రవి చంద్రారెడ్డికి మద్దతుగా వెళ్లారు. ఇది టీడీపీ, జనసేన శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో, పుష్ఫ -2 విడుదల సమయంలో జరిగిన వ్యతిరేక ప్రచారం వేళ వైసీపీ కేడర్ మద్దతుగా నిలిచింది. పలు ప్రాంతాల్లో పుష్ఫ -2 పోస్టర్ల పైన జగన్ ఫొటోలు ముద్రించారు. ఇప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే, సినిమా ప్రీమియర్ షో వేళ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవటంతో అల్లు అర్జున్ పైన కేసు నమోదు అయింది.

BJP leader Rajasingh reacts on Allu Arjun Arrest made key suggestion for Govt and Police

ఈ కేసులో నేడు పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు తరలించా రు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ ను తప్పు బట్టారు. తొక్కిసలాట జరగకుండా చూడాల్సింది ఎవరని ప్రశ్నించారు. ఇక, ఇప్పుడు బీజేపీ నేతలు సైతం రంగంలోకి దిగారు. అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం అన్యాయమని ట్వీట్ చేశారు. తొక్కిసలాట ఘటన పోలీస్ శాఖ స్పష్టమైన వైఫల్యాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. జాతీయ అవార్డును సాధించిన అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని విశ్లేషించారు.

అల్లు అర్జున్ తన విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గౌరవం తీసుకొచ్చారని ప్రశంసించారు. ఈ విషయంలో అతడిని బాధ్యుడిని చేయడం అన్యాయం, అసమంజసమని రాజాసింగ్ పేర్కొ న్నారు. జనాలను నియంత్రంచడంలో లోపాలను పరిష్కరించడానికి బదులుగా, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకోవడం పరిపాలన వైఫల్యమేనని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఉన్న అల్లు అర్జున్ కు రిమాండ్ విధిస్తారా.. హైకోర్టులో విచారణలో ఉన్న క్వాష్ పిటీషన్ పై నిర్ణయం వెలువడే వకూ వేచి చూస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+