తెలంగాణాలో ఒక్కో స్థానంపై బీజేపీ ఫోకస్ .. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా రంగంలోకి దిగ్గజనేత!!

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికలకు సమయం ఉండగానే ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే అభ్యర్థుల వేటలో వున్నాయి. ఎక్కడి నుంచి ఎవర్ని రంగంలోకి దించితే విజయావకాశాలు మెరుగవుతాయి అన్నదానిపై పార్టీ అధినాయకత్వం ఇప్పటినుంచే సమాలోచనలు జరుపుతోంది.

తెలంగాణాపై బీజేపీ ఫోకస్ .. రేవంత్ కు చెక్ పెట్టే ప్లాన్

తెలంగాణాపై బీజేపీ ఫోకస్ .. రేవంత్ కు చెక్ పెట్టే ప్లాన్

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పై ఫోకస్ చేస్తున్న బిజెపి, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని, వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అధికార పార్టీకి చెక్ పెట్టే వ్యూహాలను రచిస్తూనే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన అభ్యర్థులపై కూడా ఫోకస్ పెడుతుంది. తాజాగా టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే వ్యూహంలో బీజేపీ అధినాయకత్వం లోక్సభ ఎన్నికలకు బలమైన నేతను రంగంలోకి దింపనున్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.

మల్కాజ్ గిరి లోక్సభా నియోజకవర్గం నుండి కీలక నేత రంగంలోకి

మల్కాజ్ గిరి లోక్సభా నియోజకవర్గం నుండి కీలక నేత రంగంలోకి

ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతల స్థానాలను ఖరారు చేసిన బీజేపీ, చాలా లోక్సభ స్థానాలకు కీలకమైన నేతలను రంగంలోకి దింపనున్నట్టు తెలుస్తుంది. కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి లోక్ సభ సీట్లు ప్రధానం కావడంతో తెలంగాణలోని లోక్సభ స్థానాలపై బీజేపీ దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఎంపీగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఈసారి బిజెపి సీనియర్ నాయకుడు మురళీధర్ రావు రంగంలోకి దిగబోతున్నారు అని తెలుస్తుంది.

మురళీధర్ రావుకు రాజ్యసభ సీటు ఇవ్వంది అందుకే... ఆసక్తికర చర్చ

మురళీధర్ రావుకు రాజ్యసభ సీటు ఇవ్వంది అందుకే... ఆసక్తికర చర్చ

బిజెపి సీనియర్ నాయకుడు మురళీధర్ రావు ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాజ్యసభ అభ్యర్థిగా మురళీధర్ రావు కు స్థానం దక్కుతుందని భావించినప్పటికీ, బీజేపీ అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించలేదు. రాబోయే ఎన్నికలలో మురళీధరరావును మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దింపాలని బిజెపి అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పించలేదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

 రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా? మారనున్న రాజకీయ సమీకరణాలు

రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా? మారనున్న రాజకీయ సమీకరణాలు

ఇక ఈ స్థానం నుండి మురళీధర్ రావు ఎన్నికల బరిలోకి దిగితే రేవంత్ రెడ్డికి టఫ్ ఫైట్ వుంటుందని భావిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓటమి పాలు కావడంతోనే, ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఈసారి లోక్ సభకు కాకుండా అసెంబ్లీ నుండి ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం కూడా ఉంది. ఏదిఏమైనా రేవంత్ రెడ్డి ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గం నుండి బిజెపి సీనియర్ నాయకుడు మురళీధర్ రావును రంగంలోకి దింపితే రాజకీయం రసవత్తరంగా మారుతుంది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణాలో రానున్న ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారే అవకాశం లేకపోలేదు అని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+