‘‘పవన్ కళ్యాణ్‌ది టీఆర్ఎస్ పార్టీ బి-టీం, జనసేన రాజకీయ పార్టీయా? బ్రోకరేజి సంస్థా?’’
పవన్ కళ్యాణ్ యాత్రపై బీజేపీ నేత కృష్ణ సాగర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన రాజకీయ పార్టీనా లేదంటే బ్రోకరేజీ సంస్థనా? అని ఆయన ప్రశ్నించారు. జనసేనకు రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు లేవన్నారు.
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ యాత్రపై బీజేపీ నేత కృష్ణ సాగర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన రాజకీయ పార్టీనా లేదంటే బ్రోకరేజీ సంస్థనా? అని ఆయన ప్రశ్నించారు. పవన్ పార్టీకి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ లేవన్నారు.
జనసేన పార్టీకి లోగో ఉంది కానీ.. సిద్ధాంతం లేదు, జెండా ఉంది కానీ.. అజెండా లేదు. పవన్ ఇటు ఆంధ్రలో, అటు తెలంగాణలో ప్యాకేజీలు తీసుకుంటున్నారు. జనసేన రిలీజ్ కాకముందే ఫ్లాప్ అయిన సినిమా అంటూ కృష్ణ సాగర్ రావు ఎద్దేవా చేశారు.

'పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి. ఆయన గతంలో కేసీఆర్ సహా తెలంగాణ పోరాట యోధులను విమర్శించారు. కేసీఆర్ కూడా గతంలో పవన్ విమర్శించారు. అలాంటిది ఇప్పుడు కేసీఆర్ ఏకంగా పవన్‌ను తన ఇంటికి పిలిపించుకున్నారు. పవన్ కూడా కేసీఆర్ భజన చేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇదంతా చూస్తున్న ప్రజలే అయోమయానికి గురవుతున్నారు..' అని వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో ఉన్నవారికి మాత్రమే పవన్ తీరు అర్థమవుతుందని, పవన్ కళ్యాణ్ జనసేన.. టీఆర్ఎస్ పార్టీ బి-టీం అని, అధికార పార్టీ ఓటును చీల్చే ఓ అస్త్రమని, తెలంగాణలో, ఏపీలో ఆ పార్టీది అదే తీరు అని కృష్ణసాగర్ రావు విమర్శించారు.
'నిజంగా పవన్ కళ్యాణ్‌ది ప్రజాపక్షమైతే తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా? భజన చేయడానికి రాజకీయ పార్టీ ఎందుకు? తెలివి, విచక్షణ లేకున్నా ఫర్వాలేదు. కానీ ప్రజాజీవితంలో ఉన్నవారికి నిజాయతీ ఉండాలి. పవన్‌లో అది కొరవడింది. జనసేనలో నెంబర్ టూ కూడా లేరు. దీన్నిబట్టి ఆయన ప్యాకేజీల కోసమే పార్టీని పెట్టారని అర్థం అవుతోంది. అదో పార్టీ.. దానికో యాత్రా..' అంటూ కృష్ణ సాగర్ రావు ఎద్దేవా చేశారు.
అంతేకాదు, రాజకీయం అంటే.. అటు ఆంధ్రాకు వెళ్లి పెరుగన్నం, ఇటు తెలంగాణకు వచ్చి బిర్యానీ తినడం కాదన్నారు. ఎన్నికల హామీల్లో సీఎం కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, పైగా గళమెత్తిన ప్రజాసంఘాల నాయకుల్ని జైల్లో పెడుతున్నారని దుయ్యబట్టారు. ఆదిలాబాద్‌లో నెల రోజులుగా ఇంటర్నెట్ లేదు. ప్రశ్నించావా? అంటూ కృష్ణ సాగర్ రావు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు











Click it and Unblock the Notifications