• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'ఇస్లాంలో వివక్షత లేదు, న్యాయం చేస్తున్నారా, అన్యాయమా': సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

|

హైదరాబాద్: తెలంగాణలో ముస్లీం, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చర్చ జరిగింది. బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడారు.

ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి.. మాపై విషప్రచారం: కిషన్ రెడ్డి

ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకమని విషప్రచారం జరుగుతోందని, అది సరికాదని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి సభలో అన్నారు. మేం గిరిజన రిజర్వేషన్లకు ఏమాత్రం వ్యతిరేకం కాదని చెప్పారు. గిరిజన రిజర్వేషన్ల బిల్లుకు తాము పూర్తి వ్యతిరేకమని చెప్పారు.

కేంద్రం మాకు వదిలేయాలి, 50 శాతం ఉండాలని ఎక్కడా లేదు: కేసీఆర్‌ను ఇరుకున పడేసిన జీవన్ రెడ్డి

నాడు వైయస్ రాజశేఖర రెడ్డి మతపరంగా నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు తాము తీవ్రంగా వ్యతిరేకించామని చెప్పారు. మా మట ఖాతరు యేచకుండా నాలుగు శాతం ఇచ్చారన్నారు. నాలుగు శాతానికి ఇప్పుడు 12 శాతం తీసుకు వస్తున్నారన్నారు.

 BJP support SC reservations, but not Muslim Reservations: Kishan Reddy

కేసీఆర్ స్పందిస్తూ.. ఇవి మతపరమైన రిజర్వేషన్లు కావని చెప్పారు. మేం ఏళ్ల క్రితమే ఈ హామీ ఇచ్చామని కేసీఆర్ చెప్పారు. తాము ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నామని చెప్పారు.

దీనిపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సుధీర్ కమిటీ రిపోర్టులో ఏముంది, బీసీ కమిషన్ రిపోర్టులో ఏముందో చదవాలన్నారు.

మరో విషయం ఏమంటే గతంలో ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌కు కొనసాగింపుగా ఈ పెంపును ప్రవేశ పెడుతున్నారని చెప్పారు. అలాంటప్పుడు మతపర పెంపు కాకుండా ఎలా అవుతుందన్నారు.

సామాజిక వెనుకబాటు ఆధారంగానే ఈ పెంపు అని కేసీఆర్ చెప్పారు. ఇవి మతపరమైన రిజర్వేషన్లు కావాలన్నారు. సుధీర్ కమిటీ రిపోర్టు ముస్లీంల సామాజిక పరిస్థితులపైనే స్టడీ చేసిందన్నారు. తాను సభను తప్పుదారి పట్టిస్తున్నానని చెప్పడం సరికాదన్నారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సభను తప్పుదారి పట్టిస్తున్నారని తాను చెప్పింది వాస్తవమే అన్నారు. సుధీర్ కమిటీ రిపోర్టులో మత ప్రస్తావన ఉందని చెప్పారు.

ఇస్లాంలో వివక్షత లేదు, సామాజిక అసమానత లేదు: కిషన్ రెడ్డి

ఇస్లాంలో కుల వ్యవస్థ లేదని, సామాజిక అసమానత లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఇస్లాంలో కుల వివక్షత ఉండదని చెప్పారు. సామాజిక అసమానద లేదన్నారు. అలా ఉంటే అది ఇస్లాంకు వ్యతిరేకం అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదన్నారు. సామాజిక వివక్షత ఆధారంగానే ఇవ్వాలన్నారు.

తెలంగాణలో అనేక ఏళ్ల పాటు ముస్లీంలు పరిపాలనలో ఉన్నారని, అలాంటప్పుడు వివక్షత ఎక్కడిది అన్నారు. మతప్రాతిపదికన ముస్లీంలకు బీసీలలో రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు. మతపరమైన రిజర్వేషన్లను హైకోర్టు రెండుసార్లు కొట్టేసింది.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం

బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. అంబేడ్కర్ సదుద్దేశ్యంతో రిజర్వేషన్లు ప్రవేశ పెడితే.. రాజకీయ పార్టీలు దానిని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని అన్నారు. ఓ సమయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సభలో నేను మాత్రమే వాస్తవం చెబుతున్నానని చెప్పారు.

చారిత్రాత్మక తప్పిదం

మతపరమైన రిజర్వేషన్లు చారిత్రక తప్పిదమన్నారు. కులాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకు వచ్చారని చెప్పారు. రిజర్వేషన్లను ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాడుకుంటున్నాయన్నారు.

తాము మేనిఫెస్టోలో చెప్పామని, కాబట్టి ఇస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారని, అందులో తప్పులేదని, అలాగే తాము కూడా మతపరమైన రిజర్వేషన్లు వద్దని ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు. హైకోర్టు రెండుసార్లు మతపరమైన రిజర్వేషన్లు కొట్టేసిందన్నారు.

ఈ రిజర్వేషన్ల పెంపుతో బీసీలకు అన్యాయం జరగదని ముఖ్యమంత్రి చెబుతున్నారని, కానీ అన్యాయం జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. అన్యాయం జరిగింది కూడా అన్నారు.

అసెంబ్లీలో జీహెచ్ఎంసీలో 150 సీట్లు ఉన్నాయని, ఇందులో 50 సీట్లు బీసీలకు ఇచ్చారని, కానీ నాలుగు శాతం రిజర్వేషన్ల కారణంగా 30 సీట్లలో బీసీయేతరులు గెలిచారని కిషన్ రెడ్డి అన్నారు. ఇది తెలంగాణ గెజిట్ పబ్లికేషన్ అన్నారు.

తమిళనాడులే 3.5 శాతం రిజర్వేషన్లే..

మతపరమైన రిజర్వేషన్లు దేశంలో మొత్తంలో తెలంగాణలోనే ఎక్కువ ఉన్నాయన్నారు. తమిళనాడులో క్రిస్టియన్, ముస్లీం రిజర్వేషన్లు కలిపి మూడున్నర శాతం ఉన్నాయని, కానీ తెలంగాణలో మాత్రం కేవలం ముస్లీంలకే నాలుగు శాతం ఉందన్నారు.

తమిళనాడులో ముస్లీంలు 5 శాతానికి పైగా, క్రిస్టియన్లు 6 శాతానికి పైగా.. మొత్తం పన్నెండు శాతం ఉన్నారని చెప్పారు. కానీ వారికి రిజర్వేషన్లు మాత్రం 3.5 శాతమే ఉన్నాయని చెప్పారు.

గిరిజనులకు న్యాయం చేస్తున్నారా.. అన్యాయమా?

అమలుకాలేని, కోర్టులు కొట్టేసిన మతపరమైన రిజర్వేషన్లతో ఎస్టీ రిజర్వేషన్లను కలపడం ఎంత వరకు సమంజసం అన్నారు. మతపరమైన రిజర్వేషన్ పెంపుతో ఎస్టీ (గిరిజన) రిజర్వేషన్ల బిల్లు పెంపు న్యాయ సమ్మతం కాదన్నారు. అది ఎస్టీలు కూడా సమ్మతించరన్నారు.

మతపరమైన బిల్లుతో దీనిని కలపడం చూస్తుంటే మీరు ఎస్టీలకు న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా అని నిలదీశారు. ముస్లీంలలో వెనుకబాటు ఉంటే షాదీ ముబారక్, ఆర్థిక సాయం వంటివి చేస్తే మేం కూడా మద్దతిస్తామన్నారు. కానీ మతపపరమైన రిజర్వేషన్లు అంగీకరించమన్నారు.రాష్ట్రంలో ఎన్నో మైనార్టీ విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పారు.

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభను అడ్డుకుంటున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ కె లక్ష్మణ్, రాజాసింగ్, చింతల రామచంద్రా రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లను సస్పెండ్ చేశారు.

English summary
BJP MLA Kishan Reddy on Sunday said that BJP support SC reservations, but not Muslim Reservations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X