కేసీఆర్ సర్కార్ కు కౌంట్‌డౌన్ మొదలైంది: టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలైజ్ మోషన్ పై తరుణ్ చుగ్ సంచలనం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేగిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తో పాటుగా టీఆర్ఎస్ పార్టీ భగ్గుమంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేసింది. ఇక మోడీ తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ ఎంపీలు ప్రధాని మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై రాజ్యసభ ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రటరీకి నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, సంతోష్ లింగయ్య యాదవ్, సురేష్ రెడ్డి నోటీస్ ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారు అని అందులో పేర్కొన్నారు.

తెలంగాణ ఎంపీల ప్రివిలేజ్ మోషన్ పై తరుణ్ చుగ్ ఫైర్

తెలంగాణ ఎంపీల ప్రివిలేజ్ మోషన్ పై తరుణ్ చుగ్ ఫైర్


ఇక తాజాగా తెలంగాణ ఎంపీల ప్రివిలేజ్ మోషన్ పై బిజెపి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ స్పందించారు. టిఆర్ఎస్ పార్టీ పై, తెలంగాణ సీఎం కేసీఆర్ పై, టిఆర్ఎస్ నాయకులపైన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ తనకు తాను తెలంగాణకు రాజు గా భావిస్తున్నారని తరుణ్ చుగ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్ కు బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని తరుణ్ చుగ్ మండిపడ్డారు.

కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది

కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది

మోడీ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. దేశంలో ఎవరైనా రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాల్సి ఉందని, కానీ కేసీఆర్ ఆ విధంగా లేరని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. కెసిఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు.

పూర్తిగా అవినీతి మయంగా కేసీఆర్ ప్రభుత్వ పాలన

పూర్తిగా అవినీతి మయంగా కేసీఆర్ ప్రభుత్వ పాలన

కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేస్తున్నది ఏమీ లేదని, తెలంగాణ ప్రజలు రకరకాల బాధలు పడుతున్నారని తరుణ్ చుగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. కేసీఆర్ తీరును తెలంగాణా సమాజం చూస్తుందని తరుణ్ చుగ్ వెల్లడించారు.

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఇది మరింత ముదిరింది. టిఆర్ఎస్ పార్టీ ఏకంగా కేంద్రంలోని బిజెపి పెద్దలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, తెలంగాణ పట్ల కేంద్రానికి వివక్ష ఉందని పదేపదే మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం బాగు పడుతుంటే, అభివృద్ధి చెందుతుంటే కేంద్రం సహించలేక పోతుందని అక్కసు వెళ్లగక్కుతున్నారు అని పదే పదే విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఒకరిపై ఒకరు నిత్యం విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడానికి ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా వదలకుండా రెండు పార్టీల నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+