వరంగల్ లోకసభ ఎన్నిక: బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థి ఎన్నారై దేవయ్యనే
హైదరాబాద్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికకు తెలుగుదేశం, బిజెపి కూటమి అభ్యర్థి ఖరారయ్యారు. ఎన్నారై దేవయ్యను బరిలోకి దింపాలని బిజెపి, టిడిపి కూటమి నిర్ణయించింది. వరంగల్ జిల్లా జనగామకు చెందిన ప్రముఖ వైద్యుడు రాజమౌళి పేరు తుది వరకు చర్చలో ఉన్నప్పటికీ దేవయ్యనే చివరకు ఖరారు చేశారు.
బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థి ఖరారు కావడంతో వరంగల్ లోకసభ ఉప ఎన్నికకు అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారైనట్లే. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నుంచి పసునూరి దయాకర్ పోటీ చేస్తున్నారు. కాగా, కాంగ్రెసు నుంచి మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య అభ్యర్థిగా ఎంపికయ్యారు.

వామపక్షాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్‌ను బరిలోకి దించాయి. దీంతో వరంగల్ లోకసభలో చతుర్ముఖ పోటీ జరగనుంది. కాంగ్రెసు అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు మద్దతు ఇవ్వడానికి వామపక్షాలు నిరాకరించాయి.
ఎన్నారై దేవయ్యకు టికెట్ ఇవ్వడంపై బిజెపి, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుల్లో కొంత అసంతృప్తి చోటు చేసుకుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామా చేయడం వల్ల వరంగల్ లోకసభ స్థానం ఖాళీ అయి ఉప ఎన్నిక జరుగుతోంది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications