ప్రధాని మోడీ సభలతో మోత పుట్టించేలా బీజేపీ బిగ్ ప్లాన్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో బిజెపి దూకుడు పెంచుతుంది.ఈ దఫా ఎన్నికలలో ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి ప్రచార పర్వంలో జోరు కొనసాగిస్తుంది. జాతీయ నాయకులను రంగంలోకి దింపి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న బిజెపి, విజయ అవకాశాలు ఉన్న నియోజకవర్గాలలో మరింత ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగా ఏకంగా పీఎం నరేంద్ర మోడీని రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంది.
ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో వీలైనన్ని ఎక్కువ సభల్లో మాట్లాడించాలని బిజెపి ప్లాన్ చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా తెలంగాణ రాష్ట్రంలో వర్కౌట్ అవుతుందని భావిస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా వారం రోజుల్లో ఆరు సభలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో మోత పుట్టించనుంది.

మేనిఫెస్టో ద్వారా ఓటర్ల మద్దతు పొందడం కోసం ప్రయత్నం చేస్తున్న బిజెపి, ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీని ప్రజల్లోకి తీసుకువెళ్లి బిజెపి ఓటు బ్యాంకు పెంచే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో రానున్న వారం రోజులలో ప్రధాని నరేంద్ర మోడీతో ఆరు సభలకు బిజెపి ప్లాన్ చేస్తుంది.
వరంగల్, నిర్మల్, కరీంనగర్, మెదక్ జిల్లాలలో ప్రధాని నరేంద్ర మోడీ సభల కోసం నేతలు ప్రణాళికలు చేస్తున్నారు. ఈనెల 27వ తేదీన హైదరాబాద్లో నరేంద్ర మోడీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈనెల 25వ తేదీన తేదీన హైదరాబాద్ కు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ, 25న కరీంనగర్ జిల్లాలోనూ, 26న నిర్మల్ సభలోను ప్రసంగించనున్నారు. 27వ తేదీన హైదరాబాద్లో రోడ్ షోలో పాల్గొననున్నారు.
ఇక ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే కాకుండా అమిత్ షా, జేపీ నడ్డా, యోగీ ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, దేవేంద్ర ఫడ్నవీస్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలోనూ కేసీఆర్ సర్కార్ తీరును ఎండగడుతూ బీజేపీని ఆదరించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications