హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోనమెత్తిన గోల్కొండ: నాయిని, పద్మారావు పూజలు, పోతరాజుల విన్యాసాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గోల్కొండ బోనాల ఉత్సవాలు అంగరంగా వైభవంగా ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైయ్యాయి. బోనాల ఉత్సవాలలో గోల్కొండ కోటపై ఉన్న శ్రీజగదాంభిక మహంకాళీ (ఎల్లమ్మతల్లి) అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి పద్మారావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించారు.

లంగర్‌హౌస్ చౌరస్తాలో అమ్మవారి భారీ తొట్టెలకు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పూజలు నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు.

డప్పు వాయిజ్యాల మధ్య శివసత్తుల పునకం పోతురాజుల నృత్యాలు యువత కేరింతతో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు జరుపుకున్నారు. ఆలయ పునర్ నిర్మాణ కమిటీ సభ్యులు గోవింద్‌రాజ్, దైవజ్ఞశర్మతో పాటు దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజలందరు కలిసిమెలసి జరుపుకునే పండుగ బోనాలు అని అన్నారు.

గోల్కొండ బోనాల ఉత్సవాలలో భాగంగా పోతరాజుల నృత్యాలు అలరించాయి. ఆదివారం గోల్కొండ బోనాల ఉత్సవాలలో పోతరాజుల నృత్యాలే ప్రజలను అకట్టుకున్నాయి. పోతురాజులతో పాటు శివసత్తులు పునకం పూనారు. డజన్ మంది పోతరాజలు నృత్యాలు చేశారు. లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి దేవాలయం వరకు భారీ ఊరేగింపులో పాల్గొన్నారు.

బాల పోతరాజు

బాల పోతరాజు

గోల్కొండ బోనాల ఉత్సవాలు అంగరంగా వైభవంగా ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైయ్యాయి.

పోతరాజులు

పోతరాజులు

బోనాల ఉత్సవాలలో గోల్కొండ కోటపై ఉన్న శ్రీజగదాంభిక మహంకాళీ (ఎల్లమ్మతల్లి) అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారి వేషాధారణలో..

అమ్మవారి వేషాధారణలో..

మంత్రి పద్మారావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించారు.

వైభవంగా బోనాలు

వైభవంగా బోనాలు

డప్పు వాయిజ్యాల మధ్య శివసత్తుల పునకం పోతురాజుల నృత్యాలు యువత కేరింతతో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు జరుపుకున్నారు.

మంత్రి పద్మారావు

మంత్రి పద్మారావు

మంత్రి పద్మారావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించారు.

మంత్రి నాయిని

మంత్రి నాయిని

లంగర్‌హౌస్ చౌరస్తాలో అమ్మవారి భారీ తొట్టెలకు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పూజలు నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు.

వైభవంగా బోనాలు

వైభవంగా బోనాలు

ఆలయ పునర్ నిర్మాణ కమిటీ సభ్యులు గోవింద్‌రాజ్, దైవజ్ఞశర్మతో పాటు దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా బోనాలు

వైభవంగా బోనాలు

హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజలందరు కలిసిమెలసి జరుపుకునే పండుగ బోనాలు అని అన్నారు.

వైభవంగా బోనాలు

వైభవంగా బోనాలు

బోనాల ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. తిని, తాగే పండుగే, బోనాల పండుగ అని నవ్వుతూ మాట్లాడారు.

వైభవంగా బోనాలు

వైభవంగా బోనాలు

నగరంలోని బోనాల ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలను ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు.

వైభవంగా బోనాలు

వైభవంగా బోనాలు

ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం బోనాల పండుగను గుర్తించలేదని ఆరోపించారు.

వైభవంగా బోనాలు

వైభవంగా బోనాలు

ప్రపంచమంత బోనాల పండుగను గుర్తించింది, కానీ సీమాంధ్ర ప్రభుత్వం ఏనాడు తెలంగాణ పండుగలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైభవంగా బోనాలు

వైభవంగా బోనాలు

అక్కాచెల్లెళ్లు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని, దీంతో అమ్మవారు ప్రజలందరిని సల్లగా చూస్తుందని పేర్కొన్నారు.

వైభవంగా బోనాలు

వైభవంగా బోనాలు

నగరంలో మొట్ట మొదటగా బోనాల పండుగను గోల్కొండకోటపై ఉన్న శ్రీజగదాంభిక అమ్మవారికి పూజల నిర్వహించిన తర్వాతనే నగరమంతట జరుపుకుంటామని చెప్పారు.

వైభవంగా బోనాలు

వైభవంగా బోనాలు

కులీఖుతుబ్‌షా కాలం నుంచి బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

వైభవంగా బోనాలు

వైభవంగా బోనాలు

పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలు నగరంలో హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలసి జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు.

వైభవంగా బోనాలు

వైభవంగా బోనాలు

జంట నగరాల్లో బోనాలు ఉత్సవాలు ప్రశాంతమైన వాతావారణంలో ఘనంగా జరుపుకోవాలని కోరారు.

వైభవంగా బోనాలు

వైభవంగా బోనాలు

గోల్కొండ బోనాల ఉత్సవాలలో భాగంగా పోతరాజుల నృత్యాలు అలరించాయి. ఆదివారం గోల్కొండ బోనాల ఉత్సవాలలో పోతరాజుల నృత్యాలే ప్రజలను అకట్టుకున్నాయి.

English summary
The month-long Bonalu festivities began on a grand scale at the Jagadamba Mahankali temple in the historic Golkonda Fort on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X