అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్"గా ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. అలానే మరో సంగీత దర్శకుడు తమన్ బ్యాగ్రౌండ్ అందించారు. గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుండడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
తమిళ్ నటుడు పార్తిబన్, అషుతోష్ రానా, నవాబ్ షా, చమ్మక్ చంద్ర, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనుండడం మరింత హైప్ క్రియేట్ చేసింది. కాగా ఇప్పటికే విడుదల చేసిన పాట, వీడియోలు మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. అంతే కాకుండా గతేడాది వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్.. "హరిహర వీరమల్లు" చిత్రంతో నిరాశపరిస్తే.. "ఓజీ" మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. మరి మూడో సినిమాతో హిట్ కొట్టారో ?? లేదో తెలుసుకుందాం..

సినిమా కథ..
తెలంగాణ ముఖ్యమంత్రిపై దాడి జరగడంతో ఆయన చికిత్స కోసం విదేశాలకు వెళ్తారు. ఈ సమయంలో నల్ల నాగప్ప (పార్థిబన్) తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతాడు. అతని కుమారుడు అటవీ ప్రాంతంలోకి వెళ్లి, అక్కడ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) చేతికి చిక్కుతాడు. అతన్ని విడిపించేందుకు టెర్రరిస్టులను ఉపయోగించుకునే నాగప్ప.. మరోవైపు భగత్ సింగ్ ఎందుకు అతన్ని బందీగా ఉంచుకున్నాడు? ముఖ్యమంత్రిపై దాడికి అసలు కారణం ఏమిటి? భగత్ సింగ్ గతంలో ఏమి జరిగింది? అన్నదే అసలు కథ.
మూవీ విశ్లేషణ..
ఈ సినిమా విడుదలకు ముందే Theri రీమేక్ అనే ప్రచారం జరిగింది. కానీ సినిమా చూస్తే కొన్ని ప్రాథమిక పోలికలు తప్ప, పూర్తిగా అదే కథ కాదు అని స్పష్టం అవుతోంది.ఆ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా పోలీస్ ఆఫీసరే. అలానే విజయ్ ఒక రేప్ కేసును డీల్ చేస్తూ తన కుటుంబాన్ని కోల్పోతే.. ఇక్కడ కూడా ఒక రేప్ కేసును డీల్ చేసినందుకే పవన్ కళ్యాణ్ తన కుటుంబానికి దూరమవుతాడు. అంతకుమించి ఆ సినిమాకి ఈ సినిమాకి వేరే పోలికలు లేవు.
సినిమా ప్రారంభంలోనే ఒక ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం సమయంలో కొంతమందిని రాజ్ భవన్ లోనే మట్టుపెట్టినట్లు చూపిస్తారు. ఒక్కసారిగా సినిమా మీద ఆసక్తి పెంచేసే సీన్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బాల్యం నుంచి చూపిస్తూ, అతనికి ముఖ్యమంత్రికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అసలు కథ చివరి వరకు రివీల్ చేయకుండా నడిపించడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. కానీ కథనం ఇంకా బాగా రాసుకుని స్క్రీన్ ప్లే మీద ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
కాగా సాలిడ్ ఇంట్రడక్షన్, ఆ తర్వాత రెండు పవర్ ఫుల్ యాక్షన్ బ్లాక్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తాయి. అనంతరం అద్దిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్, చివరగా పవర్ ఫుల్ క్లైమాక్స్ తో మూవీ బ్లాక్ బస్టర్ అంటూ మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసేలా చేశాయి. పవన్ కళ్యాణ్ తనదైన మ్యాజిక్ తో, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఉన్నంతసేపు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ డాన్సులు సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయ్యాయనే చెప్పాలి.
ఇక మరి ముఖ్యంగా తొలిప్రేమ సాంగ్ రీమేక్, ఒక స్టార్ హీరో సాంగ్ ని పవన్ తో స్టెప్పులు వేయించడం సహా పలు చోట్ల దర్శకుడిగా హరీష్ మ్యాజిక్ చేశారు. ఎలివేషన్ సీన్స్, పవన్ డైలాగ్స్ కి అయితే ఫ్యాన్స్ ఫిదా అవ్వడం పక్కా. కానీ కథనం రొటీన్‌గా అనిపించే ఫీలింగ్ ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
పవన్ కళ్యాణ్ :
ఈ సినిమాకు అసలు బలం ఒక్కటే - Pawan Kalyan. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌ను అలరిస్తాయి. ముఖ్యంగా పోలీస్ పాత్రలో పవన్ మరోసారి తన మాస్ ఇమేజ్‌ను చూపించాడు. డాన్సులు, యాక్షన్ సీన్స్, ఫ్యాన్స్ కోసం పెట్టిన ఎలివేషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి.
Sreeleela - సెకండ్ హాఫ్‌లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్
Raashii Khanna - పరిమిత పాత్ర, గ్లామర్ ఆకట్టుకుంటుంది
పార్తిబన్ - విలన్‌గా బాగానే నటించాడు
అషుతోష్ రాణా, రావు రమేశ్ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు
సాంకేతిక విభాగం..
హరీష్ శంకర్ దర్శకుడిగా మెప్పించి మరోసారి మ్యాజిక్ చేశారు.
Devi Sri Prasad సాంగ్స్ థియేటర్‌లో బాగా వర్కౌట్ అయ్యాయి
S. Thaman బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్‌ను ఎలివేట్ చేసింది
సినిమాటోగ్రఫీ విజువల్‌గా బాగుంది
ఎడిటింగ్‌లో కొంత ట్రిమ్ చేసి ఉంటే ఇంకా క్రిస్పీగా ఉండేది
ప్లస్ పాయింట్స్..
పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్
మాస్ ఎలివేషన్ సీన్స్
సెకండ్ హాఫ్‌లో కొన్ని ట్విస్ట్స్
సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్..
రొటీన్ కథ
స్క్రీన్‌ప్లేలో బలహీనత
ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపించడం
భావోద్వేగాలు పూర్తిగా కనెక్ట్ కాకపోవడం
ఫైనల్ వెర్డిక్ట్..
'ఉస్తాద్ భగత్ సింగ్' - మరో హిట్ బొమ్మ
రేటింగ్ : ⭐⭐⭐ (3/5)
-
రూ. 2 వేల కోట్ల బొమ్మ.. "ధురంధర్ - ది రివెంజ్" రివ్యూ.. ఇది సార్ సినిమా అంటే !! -
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది? -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
చిరంజీవి కూతురుగా బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్.. ఎవరంటే..? -
'జబర్దస్త్' యాంకర్ ఛాన్స్ వదులుకున్న నటి ఎవరో తెలుసా? అనసూయ స్థానంలో.. -
విడుదల వేళ.. ఉస్తాద్ షాకింగ్ డెసిషన్ -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం











Click it and Unblock the Notifications