బీజేపి-బీఆర్ఎస్ రెండూ ఒకటే.!సీఎం కారుకు కమలం ముసుగేసారన్న షర్మిళ.!

హైదరాబాద్ : కారు-కమలం రెండూ ఒక్కటేనన్న తళతళ మెరుపు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు మొఖంలో కొట్టొచ్చినట్టు కనపడుతుందన్నారు వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నోరు విప్పితే బీజేపీని తిట్టే సీఎం, మోడీని పల్లెత్తుమాట కూడా అనడం లేదన్నారు.

బిడ్డ లిక్కర్ స్కాంలో దొరకగానే ఢిల్లీకి వెళ్లి రహస్యంగా బీజేపీకి పొర్లు దండాలు పెట్టాడని, కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడకుండా బీజేపీ అధిష్టానానికి మోకాళ్లు వంచాడని మండిపట్టారు షర్మిల. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం దోచుకున్న లక్ష కోట్ల గురించి అడగవద్దని బీజేపీకి సలాం కొట్టిండని షర్మిళ మండిపడ్డారు.

Both BJP and BRS are the same.Sharmila said CM covered the car with a lotus.

అవసరానికి తగ్గట్లు వేషాలు మారుస్తూ, జనాలను పిచ్చోళ్ళను చేయడమే బీజేపి-బీఆర్ఎస్ రహస్య అజెండా అని షర్మిళ ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు బీజేపీతో చంద్రశేఖర్ రావు నడిపిన దోస్తానా నువ్వు కొట్టినట్లు చెయ్యి - నేను ఏడ్చినట్లు చేస్తా అన్న చందంగా కొనసాగిందన్నారు షర్మిళ. ఇంతకు సీఎం నడిపే రహస్య దోస్తానా.. ప్రీ పోల్ ఒప్పందమా..? లేక పోస్ట్ పోల్ ఒప్పందమా..? అని షర్మిళ నిలదీసారు.

కమలం ముసుగు కప్పుకొని కారులో తిరిగే చంద్రశేఖర్ రావు అసలు విషయం బయటపెట్టాలని షర్మిళ డిమాండం చేసారు. సీఎం చంద్రశేఖర్ రావు అవినీతి గురించి మాట్లాడని బీజేపీ సైతం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

రాబోయే ఎన్నికల్లో చంద్రశేఖర్ రావుకు మద్దతు తెలపడమే బీజేపీ రహస్య ఒప్పందమా? అని సంచలన వ్యాఖ్యలు చేసారు. బీజేపీ అభ్యర్థులు సీఎంకు సప్లయింగ్ కంపెనీలా మారడమే సీక్రెట్ అగ్రీమెంటా? అని ఎద్దేవా చేసారు. చంద్రశేఖర్ రావుకు సీట్లు తక్కువ పడితే ఎమ్మెల్యేలను అందించడమే తెర వెనుక ఒప్పందమా ? ఏ ఒప్పందం లేకపోతే చంద్రశేఖర్ రావు అవినీతిపై చర్యలు ఏవి? కవిత అరెస్టుపై ఎందుకీ సాగదీత? తక్షణం బీజేపీ నోరు విప్పాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు షర్మిళ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+