హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. కానీ ఏవీ రంగనాథ్ చేస్తున్న పనికి షాక్!
హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలు, బఫర్ జోన్ లు, ఎఫ్డిఎల్ పరిధి లో నిర్మించిన అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాల పైన ఉక్కు పాదం మోపుతున్న హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైడ్రా కార్యకలాపాలకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో భారీ వర్షాలు నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చారు.
హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. అయినా రంగంలోకి రంగనాథ్
హైడ్రా టీమ్ అంతా ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా తలెత్తున ఇబ్బందులను పరిష్కరించడానికి వరద సహాయక చర్యలలో పాల్గొంటున్న నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ చెరువుల చుట్టుపక్కల కాలనీలలో పర్యటిస్తూ వరద ముంపు ప్రాంతాలను మార్క్ చేస్తున్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. దీంతో కాలనీవాసులలో ఆందోళన పట్టుకుంది.

వరద ముంపు ప్రాంతాలను మార్క్ చేస్తున్న ఏవీ రంగనాథ్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద సహాయక చర్యలలో హైడ్రా బృందాలు పాల్గొంటున్న వేళ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సైతం రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. వాటర్ లాగిన్ పాయింట్స్ ను గమనిస్తున్నారు. కాలనీలు నీటి మునగడానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత జలమయమైన ప్రాంతాలకు హైడ్రా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం చర్చ జరుగుతుంది.
ఇప్పటికే నోటీసులు... వర్షాలు తగ్గాక మళ్ళీ కూల్చివేతలు
ఇప్పటికే ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలకు నోటీసులు ఇవ్వగా, మరికొన్ని ప్రాంతాలకు కూడా నోటీసులు ఇవ్వడానికి హైడ్రా చీఫ్ సిద్ధమవుతున్నట్టు సమాచారం .ఇప్పటికే హైడ్రా నుంచి నోటీసులు అందుకున్న వారు వారం రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేయాలని లేకుంటే కూల్చివేతలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక వర్షాలు తగ్గిన తర్వాత మరికొందరు బడా బాబుల భరతం పట్టేందుకు హైడ్రా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.
వరదలు తగ్గాక టార్గెట్ ఆ భవనాలే
ఇప్పటికే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో పాటు 200 కు పైగా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఇక వర్షాలు తగ్గిన తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజీ, కేటీఆర్ ఫామ్ హౌస్ లను కూల్చేందుకు హైడ్రా రంగం సిద్ధం చేసిందని సమాచారం .ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలకు పడిన బ్రేక్ తాత్కాలికమేనని, వర్షాలు వరదలు తగ్గిన తర్వాత మరో మారు కూల్చివేతల దూకుడు కొనసాగుతుందని సమాచారం.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications