అందాల అటవీ జలపాతం బొగత సందర్శనకు పర్యాటకులకు బ్రేక్.. కారణం ఇదే!!
తెలంగాణ నయాగరాగా గుర్తింపు పొందిన బొగత జలపాతం ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగుతోంది. జలకళతో తొణికిసలాడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో బొగత పరవళ్ళు తొక్కుతోంది. బొగత జలపాతం అందాలను, అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి చాలామంది పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
అయితే బొగత కు వెళుతున్న పర్యాటకులకు అటవీశాఖ అధికారులు సందర్శన నిలిపివేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. మూడు రోజులుగా చత్తీస్ గడ్ తో పాటుగా స్థానికంగా కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతం ఉధృత రూపం దాల్చింది. 50 అడుగుల ఎత్తు నుండి జాలు వారుతున్న బొగత సుందరమైన ప్రకృతి దృశ్యంలా నిండు కుండలా మారి కొత్త అందాలతో, జల సవ్వడితో పర్యాటకుల మనసులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

అయితే బొగత జలపాతం అందాలు ప్రతి ఒక్కరిని బొగత జలపాతం వద్దకు వెళ్ళేలా చేస్తున్నాయి. కానీ సందర్శకులు బొగత కు రావద్దని వరద ఉధృతి పెరగడంతో అటవీ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. మళ్లీ వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత బొగత సందర్శన విషయంలో పర్యాటకులను అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు పర్యాటకులు బొగతకు రావద్దని ఎఫ్ఆర్ఓ చంద్రమౌళి చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే బొగత జలపాతం వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో సందర్శకులను జలపాతం లోకి దిగడానికి అనుమతి లేకుండా, కేవలం చూడడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. తాజాగా మరింత ఉధృతి పెరగడంతో, పర్యాటకులు వస్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే ఈ జలపాతాన్ని చూడటం కోసం వచ్చే పర్యాటకులు జలపాతంలో ప్రమాదాల బారిన పడకుండా ఉండటం కోసం అటవీ శాఖాధికారులు జలపాతం చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఇక పర్యాటకులు జలపాతం దగ్గర ఎంజాయ్ చేయడానికి ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు, అందులో పర్యాటకులు సరదాగా గడిపేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు సందర్శన నిలిపివేసింది..












Click it and Unblock the Notifications