హైదరాబాద్ లో పేలుళ్లకు భారీ కుట్ర.. ఉగ్రవాదులతో లింక్స్ ఉన్న ఇద్దరు అరెస్ట్..!
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ లో పేలుళ్లకు భారీ కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం భగ్నం చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్(29).. హైదరాబాద్ కు చెందిన సమీర్(28).. నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తేలింది. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లకు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక అభద్రతాభావం మొదలైంది. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ప్రజలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. ఏ క్షణాన ఏం వార్త వినాల్సి వస్తుందోనని భయంతో ఉన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనూ ఉగ్రమూలాలు ఉన్నాయని తేలింది. దీంతో తెలుగు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం తీవ్రంగా గస్తీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు పన్నిన భగ్నం చేశారు. నగరంలో విధ్వంసానికి కుట్ర చేసిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ , సయ్యద్ సమీర్ లను అరెస్ట్ చేశారు.
అరెస్టయిన సిరాజ్, సమీర్ లకు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు దుండగులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. హైదరాబాద్ లో డమ్మీ బ్లాస్టింగ్ చేసేందుకు వీరు యత్నించినట్లు సమాచారం. దీనిపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో జరిగే ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఫేక్ న్యూస్ కు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications