ఇంటర్నెట్‌లో వైరల్: భావోద్వేగంతో బ్రిటిష్ ఎయిర్‌వేస్ యాడ్ (వీడియో)
హైదరాబాద్: బ్రిటిష్ ఎయిర్‌వేస్ తాజాగా రూపొందించిన ఒక ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌లా వెళుతోంది. ఆ యాడ్ చూసిన ప్రతి ఒక్కరూ వారియొక్క నానమ్మ, అమ్మమ్మలను తప్పక తలుచుకుంటున్నారు. అంతలా నెటిజన్లను ఆకర్షించిన ఆ వీడియోలో ఏముంది?
రియల్ స్టోరీ ఆధారంగా రూపొందించిన ఈ యాడ్ ఎంతో భావోద్వేగంతో కూడుకుని ఉంది. ఈ యాడ్ గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంగా రాసింది. అంతే ఆ వార్తా కథనానికి యూట్యూబ్‌లో పదకొండు లక్షల హిట్స్ వచ్చాయి. ఈ కమర్షియల్ యాడ్‌కి మాసన్ డైరెక్టర్ నీరజ్ గవాన్ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నీరజ్ మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఈ యాడ్‌కి స్పందన వస్తుందని తాను ఊహించలేదని తెలిపారు. సేపియంట్‌నిట్రో ఏజెన్సీ ఇచ్చిన ఐడియా ఆధారంగా ఈ యాడ్‌ను రూపొందించామని తెలిపారు. ఈఈ యాడ్‌కు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదన్నారు.

ఈ యాడ్‌ను వీక్షించిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్వయంగా ఫోన్ చేసి తనను అభినందించారని ఆయన పేర్కొన్నారు. ఈ యాడ్‌లో పలికిన భావోద్వేగాలు ప్రతి ఒక్కరి మనసుకి అత్తుకునేలా చేశాయని తెలిపారు. ఈ యాడ్‌కు సురోజ్ దత్ మాటలను అందించారన్నారు.
ఈ యాడ్‌లో నటి ఉమా టుంబల్కర్ నానమ్మ పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం నీరజ్ ప్రత్యేకించి ఉమా టుంబల్కర్‌ను ఎంపిక చేసుకోవడంలో ఓ ప్రత్యేకత ఉందన్నారు. ఆమె చూడగానే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని అనుకున్నామన్నారు.
ఇంతకీ ఈ యాడ్‌లో ప్రత్యేకత ఏంటంటే... ఈ యాడ్‌లో నటించిన ఉమా టుంబల్కర్ హైదరాబాద్‌లో ఓ గృహిణి పాత్రలో నటించడం. ప్రపంచ ప్రఖ్యాత సంస్ధ అయిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ తన యాడ్‌లో హైదరాబాద్‌కు సంబంధించినట్లుగా చూపించడమే. ఈ యాడ్ ఓ ఫీల్ గుడ్‌లా అనిపిస్తోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications